S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం

విశాఖపట్నం, జూలై 2: దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి ఆరోపించారు. ఇక్కడి సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై ప్రేమ పేరుతో దాడులు ఎక్కువ అవుతున్నాయని, నేరస్తులకు కొంతమంది అధికార పార్టీ నేతలం కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో కూడా మహిళలకు న్యాయం జరుగడం లేదన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ప్రసార మాధ్యమాల్లో మహిళలను అంగడివస్తువుగా చూపిస్తుండటంతో దాడులు ఎక్కువ అవుతున్నాయన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ మహిళలకు న్యా1 చేయాల్సిన పోలీసులు ప్రజాప్రతినిధులు నేరస్తులకు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ఐద్వా నగర కార్యదర్శి మాధవి మాట్లాడుతూ నగరంలో కూడా నేరాలు ఎక్కువ అవుతున్నాయని విమర్శించారు. మారికవలసలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైనా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అశ్లీల పోస్టర్లను తొలగించేనాథుడు లేరన్నారు.

పేదలకు దూరమవుతున్న విద్య
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల
మూసివేతను నిలుపుదల చేయాలి
ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన
నర్సీపట్నం,జూలై 2: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు ఎత్తివేతను నిలుపుదల చేయాలని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ. ఓంకార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వలన పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎఐఎస్‌ఎప్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. స్థానిక శ్రీకన్య కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఆక్కడ వారంతా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ గుర్తింపు లేని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలను మూసివేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుకునేందుకు అండగా ఉన్న స్కూల్స్, వసతి గృహాలను ఎత్తివేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో కొత్తగా ఎస్సీ కళాశాల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని, బి.సి. కళాశాల హాస్టల్‌కు పక్కా భవనాలను నిర్మాణం చేయాలన్నారు. మెస్ ఛార్జీలు పెంచాలని, ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాల్లో మరుగుదొడ్లు, ఇతర వౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
నర్సీపట్నం, మాకవరపాలెం మీదుగా తూటిపాల వెళ్ళే ఆర్టీసి బస్‌ను పునరుద్ధరించాలని, నర్సీపట్నం నుండి ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలకు ప్రత్యేకంగా బస్‌లు నడపాలని కోరారు.పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కె.సూర్యారావుకు వినతి పత్రం అందించారు. ఈ ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బిసిహెచ్ రాజుబాబు, రూరల్ శాఖ కార్యదర్శి జి.గురుబాబు, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు అడిగర్ల శివ, రాజుకుమార్, లగుడురమణబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

విలక్షణ రాజకీయనేత దాడి!
మూడు దశాబ్దాల పాటు ప్రజాజీవితంలోనే
రాకకోసం టిడిపి శ్రేణుల నిరీక్షణ
నేడు జన్మదినోత్సవ వేడుకలు
అనకాపల్లి, జూలై 2: విద్యావేత్తగా, రచయితగా, సాంస్క్రతిక రంగాల ప్రధాతగా అధికారమున్నా లేకపోయినా ప్రజలతో మమేకమయ్యే రాజకీయవాదిగా మాజీమంత్రి దాడి వీరభద్రరావు తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని చాటుకున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆయన జన్మదినోత్సవ వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు సన్నద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రస్థానం సాగించి అనకాపల్లి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, దివంగత సిఎం ఎన్టీఆర్ క్యాబినెట్‌లో రెండు పర్యాయాలు మంత్రిగా, వైఎస్ ప్రభుత్వ హయాంలో సైతం తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభా పక్షం నేతగా అటు అధికారంలోను, ఇటు అనధికారంలోను కీలకమైన పదవులు నిర్వహించి ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని చాటుకుని విలక్షణ రాజకీయవాదిగా గుర్తింపు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తనకు రాజకీయ ఉజ్వల భవిష్యత్ కల్పించిన పార్టీని వదిలివెళ్లారనే అపవాదును ఆయన మూటగట్టుకోవాల్సి వచ్చింది. జరిగిన పొరపాటుతో మనస్థాపం చెంది వెంటనే వైఎస్సాఆర్ సిపికి గుడ్‌బై చెప్పి గడచిన రెండేళ్ల కాలంగా ఏ రాజకీయ పార్టీకి చెందకుండా సాధారణ ప్రజానేతగానే ఎప్పటికప్పుడే సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసం పనిచేసేందుకు పదవులు, పార్టీలు అవసరం లేదని నిరూపించే నేతగా గుర్తింపు పొందారు. తమ ప్రియతమ నేత దాడి తిరిగి సొంత గూటికి ఎప్పుడు చేరతారనే ఉత్కంఠతతో అనకాపల్లి అసెంబ్లీ పరిధిలోని ఆయన సన్నిహిత్వంలో పనిచేసిన పలువురు నేతలు, కార్యకర్తలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. రాజకీయంగానే కాక నాటక రచయితగా, సాంస్క్రతిక రంగాల ప్రోత్సాహకునిగా దాడి జాతీయ స్థాయిలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. దాడి రచించిన పలుకే బంగారమాయే నాటకం సంచలనం సృష్టించింది. ఆ నాటకాన్ని రాష్టప్రతి ప్రశంసలు సైతం అందాయి. ఆయన కలం నుండి జాలువారిన రాజసూయ యాగం నాటకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దాడి రచించిన ఎన్నో నాటకాలు, నాటికలు పలు రాష్ట్ర, జాతీయ నాటక పరిషత్‌ల్లో సైతం అత్యుత్తమ పురస్కారాలు పొందాయి. దాడి నేతృత్వంలో 1972లో ఆవిర్భవించిన డైమండ్ హిట్స్ సాంస్క్రతిక సంస్థ వేదికగా ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రముఖ సాంస్క్రతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో ఆ పార్టీలో 1984లో చురుకైన పాత్ర నిర్వహించి అధినేత రామారావును సైతం ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ బతికున్నంత కాలం రాజకీయంగానే కాక అటు ప్రభుత్వంలోను ఇటు పాలనలోను దాడి చెప్పిందే వేదంగా సాగింది. వైఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి పాలనా వైఫల్యాలపై తనదైన పంధాలో గళం విప్పి ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అధికారంలోనే కాక ప్రతిపక్షంలోను కూడా దాడి సమర్ధతను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో దేశం శాసనమండలి పక్షం పదవిని ఇచ్చి బాబు గౌరవించారు. తెలుగుదేశం పార్టీలో దాడి ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన పాత్రను సమర్థవతంగా నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని చాటుకోగలిగారు. ఆయన అనకాపల్లి నుండి శాసనసభ్యునిగా, మంత్రిగా వివిధ పదవులు నిర్వహించిన సందర్భంలో ఈ ప్రాంతంలో కల్యాణ మండపాలు, రోడ్లు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డు, వందపడకల ఆసుపత్రి తదితర ఎన్నో చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పనులు చేపట్టి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తనకు పదవులు ఇచ్చి గౌరవించిన టిడిపిని వీడారనే అపఖ్యాతిని కూడా ఆయన మూటగట్టుకోవాల్సి వచ్చింది. తిరిగి ఆయన టిడిపి గూటికి ఎప్పుడు చేరతారా అని ఈ ప్రాంత నాయకులు, కార్యకర్తలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.