S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పారదర్శకంగా స్మార్ట్ పల్స్ సర్వే

విజయనగరం, జూలై 2: జిల్లాలో ఆరవ తేదీనుండి ప్రారంభిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వేను పారదర్శకంగా జరపాలని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ తహశీల్దార్లను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సర్వే నిర్వహించే సందర్భంగా ప్రజలు అపోహలకు గురికాకుండా ఎన్యుమరేటర్లు జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శనివారం కలెక్టరేట్ నుంచి మండల తహశీల్దార్లతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 50 రోజులపాటు నిర్వహించే ఈ పల్స్‌సర్వేలో ప్రతి వ్యక్తి వివరాలను 75అంశాలతో సమగ్రంగా నమోదు చేయాలని అన్నారు. ఎన్యుమరేటర్లు అన్ని ఇళ్లను సర్వేచేసి ఆయా కుటుంబాలలోని అందరి వివరాలను నమోదు చేయాలని సూచించారు. పుట్టిన తేదీ, చదువు, ఉద్యోగం, కులం, పిల్లలు, చదువుతున్న పాఠశాలలు తదితర వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని చెప్పారు. స్మార్ట్ పల్స్‌సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులు అందరికి దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. మండలాలలో అందుబాటులో ఉన్న సర్వీసుల ఆధారంగా ఎన్యుమరేటర్లకు 3జి, 2జి సిమ్‌కార్డులు అందజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, జిల్లా పంచాయితీ అధికారి సత్యనారాయణరాజు, విజయనగరం మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.