S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్రహ్మకు ఆలయమెందుకు లేదు?

* జడ భరతుడు భారతదేశం పాలించినందువల్ల ‘‘్భరతదేశం’’ ఇఅని పేరు వచ్చిందంటారు. కొందరు శకుంతలా పుత్రుడైన భరతుడు పాలించినందువల్ల అంటారు. నిజమేమిటి? కె.వి. ప్రసాదరావు, కందుకూరు
రెండూ నిజం కావు. జడభరతుడు ఈదేశాన్ని పాలించలేదు. అతని పూర్వజన్మలలో ఒక జన్మలో అతడు ‘‘బుభువు’’ అనే మహానుభావుడికి ‘‘్భరతు’’డనే పేరుతో జన్మించి ఈ భూమిని పాలించాడు. అందువల్ల ఈ దేశానికి ‘‘్భరత’’ దేశమనే పేరు వచ్చింది. ఇక్కడి ప్రజలు దివ్యతేజస్సును ఉపాసిస్తారు కనుక ఈ ప్రజలకు ‘‘్భరతులు’’( తేజస్సు నందు ఆసక్తి కలవారు( అనే పేరు వేద ప్రసిద్ధంగా వచ్చింది. ‘‘అగ్ని మిచ్ఛ్ధ్వం భారతాః’’ అని వేద వాక్యం. భారత ప్రజలు నివసించే దేశం కనుక ఈ దేశానకి ‘‘్భరతదేశము’’ అనే పేరు కూడా వచ్చింది.
*.త్రిమూర్తులలో బ్రహ్మదేవుడికి దేవాలయం లేకపోవడానికి కారణమేమిటి? సి. వనజ, హైదరాబాదు
బ్రహ్మదేవుడు సాక్షాత్ వేద స్వరూపుడు. అనగా శబ్ద స్వరూపుడు. శబ్దానికి ఆలయం వుండటం సాధ్యం కాదు. కనుక ఆయనకు మన దేశంలో ఆలయాలు తక్కువ. వేద సంప్రదాయం విస్తరించిన కొన్ని ఇతర దేశాలలో బ్రహ్మ దేవాలయాలు వున్నాయని మనం గమనించాలి. ఉదాహరణకు ‘ప్రంబనన్’ అనే హిందూ దేవాలయం ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలో ఉంది దీనిలో బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుల ఆలయాలు మూడూ నెలకొని ఉన్నాయి. అదీ గాక భారతదేశంలోని రాజస్థాన్ లో ఆజ్మీర్ దగ్గర పుష్కర్ అనే చోటా, కేరళలోని మలపురం జిల్లాలో తపనూరు గ్రామంలో గూడా బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి.
* జపం చేసేటప్పుడు జపమాలికను వస్త్రంతో కప్పుతారెందుకు? ఆర్. హనుమంతరావు, ధవళేశ్వరం
జపమాల మంత్రానికి ప్రతీక. మంత్రం రహస్యమైనంది. అందువల్లే జపమాలను గూడా గుప్తంగా వుంచుకోమని జపమాలను జపకర్త కూడా జప సమయంలో దర్శించరాదనీ ధర్మశాస్త్రాలు శాసిస్తున్నాయి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org