S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కథా రూపం (శ్రీవిరించియం 4)

మనిషికి ఒక రూపం, ప్రతి మనిషిని గుర్తించటానికి వీలయిన రూపం- శరీర నిర్మాణం వున్నట్లే, ప్రతి రచయితకు అతనిదే అయిన శైలి, సరళి, రచన పద్ధతి వుంటుంది. రచనలో ఒక వాక్యం చదవగనే యిది ‘పలానా’ రచయితదే అయి వుంటుంది అని ఖచ్చితంగా చెప్పగల పాఠకులు వుంటారు. అక్కడ ముఖ్యమయిన విషయం యేమంటే- రచయిత వ్యక్తిత్వాన్నిబట్టి అతని శైలి కూడా నిర్మాణం అయి వుంటుంది. అతని ఆలోచన పద్ధతి అతని శైలిని రూపొందిస్తుంది. శరీరము, మనస్సులకువున్న అనుబంధంలో యిదో ప్రధాన అంశం. రచయిత ఆలోచన పరిణతి చెందినకొద్దీ అతని శైలి కూడా మరింత సరళతను పెంపొందించుకుంటుంది.
కథారూప నిర్మాణం చాలా విచిత్రమయిన పరిస్థితుల్లో జరుగుతుంది. ముందుగా రచయిత మనసులో ఒక భావం బయలుదేరుతుంది. ఆ భావం చుట్టూ నెలకొన్న పరిస్థితుల యేర్పడినది కావచ్చును. లేక అతని ఆలోచనలో ఉద్భవించినదే కావచ్చును. ఆ విషయానికి- భావానికి- రూపకల్పన యివ్వడం యెలా? కథగా రాయాలా లేక యేదో యితర రూపం- నాటకం, నవల, వ్యాసం లాంటిది యివ్వాలా అనేది ఆలోచించుకుంటాడు. కథకు సరిపడ బలం ఆ భావానికి వున్నదని తేల్చుకున్న తరువాతనే రాయటానికి మొదలుపెడతాడు. ఏమిటి ఆ బలం? భావంలో నాటకీయత వున్నదా లేదా, సంశయాత్మకమయిన విషయం- దానికి పరిష్కారం కనిపిస్తోందా, ఈ భావం యితర మనస్సులమీద యెలాంటి ప్రభావం తీసుకువస్తుంది? ఈ ప్రభావంవల్ల జనావళికి మంచి జరుగుతుందా లేదా.. యిలాంటి ఆలోచనలు, కథ వ్రాయాలని నిర్ణయించుకున్న తరువాత దానిని యెలా రూపకల్పన చేయాలి అని ఆలోచిస్తాడు. ఏ పాత్రలు, ఏ సన్నివేశాలు, ఏ రకమయిన వర్ణనలు, ఏ విధమయిన సంభాషణలు వుండటానికి అవకాశం వుంది- అని ఊహలు అల్లుకుంటాడు. ప్రథమ పురుషలో రాయాలా లేక యింకేదయినా మంచి దారి వున్నదా కూడా చూస్తాడు.
తను చేసుకున్న ఊహలన్నీ తగు మాత్రం తార్కికంగా, సమరసంగా, ఆహ్లాదకరంగా, మానసికోల్లాసానికి అనుకూలంగా వున్నాయా లేదా అని చూచుకుంటాడు.
జరుగుతున్న కథలో రచయితకు ముందుగా ‘నమ్మకం’ వుండాలి. తన కల్పన, కథా సంవిధానం సజావుగా వున్నాయని, అవి యితరులకు కూడా ఆసక్తికరంగా వుంటాయని ‘నమ్మకం’ యేర్పడాలి. ఇలా నమ్మకం కూర్చటానికి, వర్ణనలు- సంభాషణలు ఉపకరిస్తాయి. అందుకే నాటికి కథాకథనంలో ప్రత్యేకమయిన స్థానం, ప్రయోజనం.
ఎవరయినా తనకు తెలిసిన విషయాలను గురించే కథలు రాయగలరు. ప్రారంభంలో ‘వస్తువు’వున్న పరిధి పెంచుకుంటూపోవడం, రచయిత యొక్క గ్రహణశక్తిని, అవగాహన పద్ధతిని, అనుసంధాన ప్రయోగశీలతల మీద ఆధారపడి వుంటుంది. చేయి తిరిగినకొద్దీ రచయితలో రుూ పరిణామ శీలత ప్రదర్శితం అవుతూ అతన్ని చదువరులకు దగ్గర వానిని ఆప్తునిగా తయారుచేస్తుంది.
ప్రతి మనిషికీ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి వుంటుంది. ఈ ఆసక్తి ఒక శాఖగా పెరిగి రచయితలో సృజనాశక్తిని ప్రోత్సహిస్తుంది. అందుచేత అతడు రాయడం తప్ప యింకేం చేయలేకపోతాడు. రాయడంలో వున్న మెలకువలు తెలుసుకున్నకొద్దీ రాణింపు పొందుతాడు. రచనలో రమ్యత చేకూర్చుకుంటాడు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584