S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాపై కెసిఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ

మక్తల్, జూలై 3: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ద్ధ ఉందని అందుకే జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరిష్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, రాష్ట్ర మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కోర్టులో కేసులు పెడుతూ పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటం హాస్యాస్పదమన్నారు. ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని జిమ్మిక్కిలు చేసిన ప్రాజెక్టులు పూర్తిచేసి జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి జిల్లాను పచ్చని పాలమూరుగా మారుస్తామని తెలిపారు. అదివారం మండల పరిధిలోని పసుపుల గ్రామంలో మెగా ఇంజనీరింగ్ కంపెని దత్తత తీసుకుని గ్రామాలలో సిసి రోడ్లు, విద్యుత్, మరుగుడొడ్లు, వాటర్ ట్యాంకు, ఇంటింటికి నల్లా కనెక్షన్, సోలార్ ప్లాంటును స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నిర్లక్ష్యంతో జిల్లాలోని నాలుగు పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తికాలేదని అన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ప్రాజెక్టులకు రూ.3వేల కోట్లను వెచ్చించి పూర్తిచేస్తామని అన్నారు. వచ్చే ఖరీఫ్‌నాటికి బీమా ప్రాజెక్టును పూర్తిచేసి 1.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముంపు గ్రామాల భూములకు లక్ష రూపాయల నుండి రెండు లక్షలు అందించి నేడు రూ.20 లక్షలను ఇవ్వాలంటూ ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని అన్నారు. కాగా మక్తల్ నియోజకవర్గంలోని తంగిడి, కృష్ణా, గుడెబల్లూర్, ముడుమాల్, మురార్‌దొడ్డి, పస్పుల లిప్ట్‌ల పూర్తికై మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి విన్నపం మేరకు తక్షణమే రూ.6కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం కృషిచేస్తుంటే ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఈజిల్లాకు చెందిన మాజీ మంత్రి డికె అరుణ అర్డీఎస్ ఆయకట్టు నుండి రాయలసీమ రఘువీరారెడ్డి నీటిని తరలించుకుపోతుంటే మంగళ హారతులు పట్టారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో 200 రెసిడెన్సియల్ పాఠశాలలను అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే రెండేళ్లలో తమ ప్రభుత్వం హాయాంలో 316 రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని అన్నారు. వీటికిగాను 4వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.