S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేడెక్కిన రాజకీయం

మహబూబ్‌నగర్, జూలై 3: జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలింది. ఓ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా మరోపార్టీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల నాయకుల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే స్థాయికి రాజకీయ రగడ ప్రారంభమయింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై మరోకరు దూషించుకుంటూ దాడులు చేసుకుంటూ ఆందోళన బాటపట్టడంతో జిల్లాలో రాజకీయం వేడిని రగిలించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ మానసపుత్రికగా భావిస్తున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభించి పూర్తి చేసి దాదాపు ఈ ప్రాజెక్టు కింద పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇందుకుగాను ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా 123 జిఓను తెచ్చి భూ సేకరణ ప్రక్రియను చకచకగా పూర్తి చేసి అనుకున్న దానికంటే ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనే పట్టుదలతో దూకుడుగా పోతున్నారు. ఈ ప్రాజెక్టు పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. అందుకు టెండర్ల ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొన్ని ఫ్యాకేజీలకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని పార్టీల రాజకీయ పార్టీలు పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటూనే లోలోపల ప్రాజెక్టు నిర్మాణానికి విపక్షాలు అంతరాయం కలిగిస్తున్నాయని తెరాస నాయకుల ఆరోపణ. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35వేల కోట్లతో ప్రభుత్వం రూపకల్పన చేసింది. పలుమార్లు డిజైన్లు చేస్తూనే అవసరాన్ని బట్టి రీడిజైన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం దాంతో కొంత అధిక భారం కూడా పడింది. అయితే పాలమూరు ఎత్తిపోతల పథకం పనులకు సంబందించి అవకతవకలు జరుగుతున్నాయని అనుభవంలేని కాంట్రాక్టులకు కట్టబెడుతున్నారని ముఖ్యంగా బిజెపి నేత మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఏకంగా కోర్టు వెళ్లగా మొదటిసారి నాగంకు హైకోర్టు నుండి చుక్కెదురైంది. అయితే మళ్లీ ఆయన ప్రాజెక్టుకు సంబంధించిన 1, 5, 8, 16 ఫ్యాకేజీలలో అవీనీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తిరిగి కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. అసలు పంచాయతీ ఇక్కడే ప్రారంభమైంది. నాగం జనార్ధన్‌రెడ్డి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారంటూ గులాబి శ్రేణులు గత వారం రోజుల నుండి నాగం దిష్టిబొమ్మలను దగ్ద్ధం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాగం దిష్టిబొమ్మలను తెరాస నాయకులు దగ్ధం చేయడాన్ని జీర్ణించుకోలేని బిజెపి నాయకులు సైతం ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవిధంగా ఉందంటూ సిఎం దిష్టిబొమ్మలను ప్రతికారంగా దగ్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగం జనార్ధన్‌రెడ్డి ఈ నెల 2వతేదీన ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తాను కోర్టుకు ఎందుకు వేళ్లాల్సివచ్చిందనే విషయాన్ని తెలియజేసేందుకు సన్నద్ధమయ్యారు. నాగం మహబూబ్‌నగర్‌కు వచ్చారని తెలుసుకున్న గులాబి నాయకులు నాగంకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇరువార్గల మధ్య తోపులాట వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా జిల్లాలో ఈ సంఘటనతో మాత్రం ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క బిజెపి నాయకులు, మరోపక్క తెరాస నాయకులు ఒకరిపై మరోకరి రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పక్షం మాత్రం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పులు జరగడంలేదని చెబుతుండగా కాదు..కాదు ప్రాజెక్టులోని కొన్ని ఫ్యాకేజీలలో అవినీతి జరుగుతుందని బిజెపి నాయకులు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. జిల్లా ప్రజానికం మాత్రం అసలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమి జరుగుతుందని అవినీతికి తావులేకుండా పనులు సజావుగా జరిగి తాము ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు తమ పొలాల్లో పారాలని రైతాంగం కోరుకుంటున్నారు. కానీ జిల్లాలో రాజకీయ పార్టీల మధ్య రగడ ప్రారంభం కావడంతో రైతుల్లో కూడా ఈ ప్రాజెక్టుపై చర్చ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నత్తనడక పనులు కొనసాగుతుండడం జిల్లా రైతాంగాన్ని విస్మయానికి గురిచేస్తుంది. పాలమరు ఎత్తిపోతల పథకానికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందిస్తే చాలు అంటున్నారు జిల్లా ప్రజానికం.