S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరఘాట్లను పరిశీలించిన మంత్రులు

మక్తల్, జూలై 3: మక్తల్ మండల పరిధిలోని పంచదేవ్‌పాడ్‌వద్ద పుష్కరఘాట్ల పనులను రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, డాక్టర్ లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రామాల్లో పాల్గొన్న మంత్రులు పుష్కరఘాట్లను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 12 నుండి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడాదిలో జరిగిన గోదావరి పుష్కరాలకు ధీటుగా కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని అన్నారు. పుష్కరాల పనులను యుద్ధ ప్రతిపాధికన పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను అదేశించారు. పుష్కరాలకు అత్యవసరంగా ఎక్కడైన పనులు అవసరమైతే వాటిని తక్షణమే మంజూరు చేసి పూర్తిచేస్తామన్నారు. పుష్కరఘాట్ల పనులలో నాణ్యత పాటించాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. పుష్కరాలు విజయవంతం కావడానికి అందరు సహకరించాలని మంత్రి కోరారు. పుష్కరఘాట్లను పరిశీలించినవారిలో ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అలవెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తెరాస నాయకులు మల్లప్ప, గోపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, నీలప్ప, రతన్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, సిఐ శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా భీమా మా ప్రాజెక్టులో అంతర్భాగమైన ప్రధానకాలువ 46వ ప్యాకెజి పెండింగ్ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పరిశీలించారు.