S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కమ్ముకున్న మేఘాలు

మహబూబ్‌నగర్, జూలై 3: గతపది రోజుల నుండి జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నప్పటికినీ వరుణుడు మాత్రం కనికరించడంలేదు. వానలు ఊరిస్తుడడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో కుండపోత వర్షం కురిసి నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తుంటే మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి, రెండవ వారంలో భారీగానే జిల్లాలో వరుణుడు కనికరించినప్పటికిని భారీ స్థాయిలో చెరువులు కుంటలు నిండి అలుగుపారే వాన కురియకపోవడం దురదృష్టకరం.
జూన్ 22వ తేదీ నుండి జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నాయి. భారీ వర్షం కురుస్తుందనే భావనతో వాతావరణం ఏర్పడుతూనే ఉంది. కానీ రోజుకో సారి కొద్దిపాటి తుంపిరిలా వాన ఇలా వచ్చి అలా వెళ్లిపోయి జిల్లా ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. ప్రతి నిత్యం ప్రసార సాధనాలు, దిన పత్రికలు చదువుతూ, చూస్తూ తెలంగాణ జిల్లాలోని వివిధ జిల్లాలో కురుస్తున్న వానల వార్తలను చూస్తున్న జిల్లా ప్రజానికం పలురకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక్కడ పట్టిన దారిద్య్రం ఎప్పుడు తీరుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కృష్ణానది అడుగంటిపోయి వెలవెల పోతుంది. వచ్చే మాసంలో కృష్ణాపుష్కరాలు ఉండడంతో ఇప్పటి నుండే వర్షాలు కురుస్తే వివిధ ప్రాజెక్టులలోకి నీరు వచ్చిచేరుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే జిల్లాలోని కృష్ణానది వెలవెల పోతుంటే మరోపక్క అక్కడ గోదావరి నది గళగళ పారుతుంటే గ్రామాలోని జనం వ్యంగ్యంగా పాటలు పాడుకుంటున్నారు. వర్షాదార పంటలకు జూన్ మాసంలో అనుకూలంగా వరుణుడు కనికరించినప్పటికిని బోర్లు, భావులకింద వరి నాట్లు నాటాలంటే భారీ వర్షాలు కురిసి చేరువులు, కుంటలు అలుగులు పారితే తప్పా నీటిమట్టం పెరగవు. ఏదిఏమైనప్పటికిని జిల్లాలో మాత్రం గత పది రోజుల నుండి మేఘాలు దండిగా కమ్ముకున్నప్పటికినీ వానలు ఊరిస్తూ ఉండడం జిల్లా ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది.