S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డిఈఓ దిష్టిబొమ్మ దగ్ధం

సూర్యాపేటటౌన్, జూలై 4: తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోన గాంధీ విగ్రహం వద్ద డిఈవో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా డిఈవో ముడుపులు తీసుకుంటున్నాడని ఆరోపించారు. పేద విద్యార్థులకు 25శాతం ఉచిత విద్యను అందించాల్సిన విద్యాసంస్థలు వారి వద్ద నుండి రూ.40వేల వరకు ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై డిఈవోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్ జిల్లాలో సస్పెండ్ అయిన డిఈవోను నల్లగొండకు బదిలీ చేసి ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి డిఈవోపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.