S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘అణువిద్యుత్ ప్లాంట్ వ్యతిరేక సదస్సు జయప్రదం చేయాలి’

గజపతినగరం, జూలై 4: శ్రీకాకుళంలోని కొవ్వాడలో నెలకొల్పనున్న అణువిద్యుత్ ప్లాంటుకు వ్యతిరేకంగా ఈనెల 17వతేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సదస్సును విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పురం అప్పారావు కోరారు. సోమవారం స్థానిక ఎన్‌జిఓ హోమ్‌లో సదస్సు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్లాంటును నిర్మిస్తే చుట్టుపక్క ల 170 కిలోమీటర్ల వరకు పం టలు పండక భూములు ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ప్రజలు వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. విదేశాల్లో నిషేధించిన ఈ ప్లాంట్లను ఇక్కడ నెలకొల్పడానికి ప్రభుత్వం సిద్ధంకావడం సిగ్గుచేటని అన్నారు. ఈ సదస్సుకు సిపిఎం జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొలుసు సత్యం, ఎ.జగదీష్, రాము, నాగేశ్వరరావు పాల్గొన్నారు.