S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బల్లంకి పాల సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు

వేపాడ, జూలై 4: మండలంలోని బల్లంకి పాల సంఘానికి నేడో,రేపో ఎన్నికలు జరిపేందుకు విశాఖ డెయిరీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షు డు తాతారావు పదవీకాలం పూర్తికావడంతో నూతన పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించా ల్సి ఉంది. ముందుగా అధ్యక్షు డు ఎన్నిక జరగాల్సి ఉన్నందున ఈ పదవి కోసం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పోటీ పడుతుండడం విశేషం. ప్రస్తుత అధ్యక్షుడు తాతారావు సమీప బంధువు వరుసకు తమ్ముడైన డే గల ఈశ్వరరావు మధ్య ఆసక్తికరమైన పోటీ జరగనున్నది. ఈ పాల సంఘంలో 163 మంది ఓటర్లు ఉండగా, అందులో నలుగురు మృతి చెందారు. రెండు డబల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి. నికరంగా 157 మంది ఓట ర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈశ్వరరావు వర్గానికి ఆవు గుర్తును, తాతారావు వర్గానికి కోడిపుంజు గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించగా, వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ ఎన్నికకోసం గత నెలరోజులుగా ఇరువర్గాలు తమ త మ వర్గానికి చెందిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వారిని ఆకట్టుకునేందుకు చేతిచమురు వదిలించుకుంటున్నారు. కాగా ఈ ఎన్కిక లో గెలిచిన అభ్యర్థులు ఆరుగురు డైరెక్టర్లను ఓడిపోయిన వర్గం నలుగురు డైరెక్టర్లను ఎంపిక చేసుకునే అవకాశం విశాఖ డెయిరీ యాజమాన్యం వీరికి కల్పించింది. ఈ పోరులో గెలుపు ఎవరిదో ఒకటి రెండురోజుల్లో తేలనుంది.