S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొండవెలగాడలో డయేరియా

నెల్లిమర్ల, జూలై 4: మండలంలోని కొండవెలగాడలో డయేరియా ప్రబలింది. గ్రామంలో సుమారు 20మంది వరకు డయేరియాతో స్థానిక పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నెల్లిమర్ల సిహెచ్‌సికి తరలించారు. గ్రామంలోని మొయిదపేట ఎస్సీ కాలనీ, రెడ్డికవీధి వాసు లు డయేరియాతో పిహెచ్‌సిలో చేరారు. వెంటనే స్పందించిన వైద్యులు నాగరాజు రోగులకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆర్ డబ్ల్యుఎస్ డిఇ శివానందకుమార్ గ్రామంలో 20 తాగునీటి శ్యాంపిల్స్ తీశారు. రోగులు పందిమాంసం, సముద్రపు చేపలు తి నడం వలన డయేరియా సోకిందని స్థానికులు చెబుతున్నట్లు డాక్టర్ నాగరాజు వెల్లడించారు. తాగునీరు కలుషితం కావడం వలన డయేరియా ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గ్రామంలో 20 మంచినీటి శ్యాంపిల్స్ సేకరించారని, మంగళవారం నాటికి పరీక్షలు జరిపి దేనివలన డయేరియా వచ్చిం దో తెలుస్తుందని చెప్పారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీరు తాగాలని, మాంసాహారం తినరాదన్నారు. ఎంపిడిఓ రాజ్‌కుమార్, తహశీల్దార్ చిన్నారావు, డయేరియా రోగులను సందర్శించారు.