S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పర్యాటకులతో కళకళలాడిన తాటిపూడి

గంట్యాడ, జూలై 4: ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిపూడి ఆదివారం పర్యాటకులతో కళకళాలాడింది. ప్రకృతి అందాలకు ప్రశాంత వాతావరణానికి నిలయమైన తాటిపూడి అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పలు వాహనాలలో భారీగా తరలివచ్చారు. ఉద్యోగులు, విద్యార్థులు ఇక్కడికి తరలివచ్చి సందడి చేశారు. తాటిపూడి జలాశయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న బోటులో షికారుచేస్తూ ప్రకృతి అందాలు తిలకిస్తూ తన్మయం చెందారు. జలాశయం ఆవల ఉన్న గంటికొండ గిరివినాయక వనవిహార్‌కు పలువురు పర్యాటకులు జలాశయం నుంచి పర్యాటక బోటులో వెళ్లి సరదా గా గడిపారు. వ్యూ పాయింట్ నుంచి జలాశయం అందాలు తిలకించి తాటిపూడి గట్టుపై అటు ఇటు తిరుగుతూ కేరింతలతో ఆనందంగా కాలం గడిపారు. ఉదయం తొమ్మిది నుంచి సా యంత్రం నాలుగు గంటల వరకు పర్యాటకులు తాటిపూడికి తరలి వస్తుండడం కనిపించింది. వర్షం పడుతుండడంతో వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో ఈ వారం పర్యాటకులు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. పిక్నిక్ రోజులలోనే కాదు మామూలు రోజులలోనూ తాటిపూడిలో పర్యాటకుల సందడే సందడి.