S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూ. 16 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ లక్ష్యం

గజపతినగరం, జూలై 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి 16కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెలుగు ప్రా ంతీయ సమన్వయకర్త కె. రాజేశ్వరి అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతవరకు రూ.2.50కోట్లు రుణాలు అందజేశామని తెలిపారు. సామాజిక పెట్టుబడి నిధి నుండి కోటీ పది లక్షల రూపాయలు రుణాలు ఇవ్వగా, 80 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయని, రెండు నెలల్లో బకాయిలు వసూలు చేయాలన్నారు. చంద్రన్న బీమా, ప్రధానమంత్రి పసల్ బీమా యోజన ఇన్సూరెన్సులను గ్రామైఖ్య సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరితో ప్రీమియం కట్టించాలన్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరిని చేర్పించాలని స్టేట్ బ్యాంక్ బ్రాంచి మేనేజర్ ఎన్. సూర్యప్రకాశరావు అన్నారు. 0-10 ఏళ్ల లోపు వయస్సు గల ఆడపిల్లలు ఈ పథకంలో చేరవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఎపిఎం శేషగిరిరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి పాల్గొన్నారు.