S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నగర పంచాయతీలో కాగితరహిత పాలన

నెల్లిమర్ల, జూలై 4: నెల్లిమర్ల నగర పంచాయతీలో కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టామని కమిషనర్ అచ్చింనాయుడు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్యాలయంలో ఇంతవరకు కాగితాల ద్వారా పరిపాలన జరిగేదని చెప్పారు. ప్రభుత్వం ఇ-పరిపాలన జరపడానికి చర్యలు చేపట్టామన్నారు. కాగిత రహిత పాలనకు 12 కంప్యూటర్లు ఏర్పాటుచేశామని, వీటిలో ఐదు కంప్యూటర్లు పాతవి కాగా, మిగిలిన ఏడు కంప్యూటర్లు కొత్తవి కొనుగోలు చేశామని వెల్లడించారు. జనన, మరణ ధ్రువపత్రాలు కంప్యూటర్ ద్వారా అందిస్తామని చెప్పారు. ఇంటిపన్నులు వివిధ రుసుములకు కంప్యూటర్ రసీదులు ఇస్తామని అన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి పల్స్ సర్వే నిర్వహిస్తున్నామని, ఈ సర్వే ద్వారా పింఛన్లు,రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులేని వారిని గుర్తించి నమోదు చేస్తామన్నారు. పది లక్షల రూపాయల ఖర్చుతో ప్రధాన కాలువ ల్లో పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. ప్రధాన కాలువ మీద నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా పూడికతీత పనులు చేపట్టాలన్నారు. అలా చేయని పక్షంలో జెసిబితో పూడికలు తీస్తామని తెలిపారు.