S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నెల్లిమర్ల నగర పంచాయతీ రద్దు కోరుతూ అర్ధ శత దినోత్సవానికి చేరిన రిలే దీక్షలు

నెల్లిమర్ల, జూలై 4: గ్రామ పం చాయతీ సాధనకు జరజాపుపేటలో ని ర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారానికి అర్థశత దినోత్సవానికి చేరుకున్నాయి. పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ దీక్షలకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం లభించింది. గ్రామంలో మహిళ లు, వృద్ధులు,చిన్నారులు, పురోహితు లు, దివ్యాంగులు, ఉద్యోగ విరమణ పొ ందిన వారు దీక్షల్లో కూర్చున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేయాలని కోరుతూ సుమారు రెండు వేల మ ందితో ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్దికోసం నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాలను నగర పంచాయతీ గా మార్పు చేసింది. దీంతో నగర పం చాయతీ వ్యతిరేక కమిటీ ఏర్పడి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఒకపక్క న్యా యం పోరాటం చేస్తూనే మరోపక్క ఆం దోళన ద్వారా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన హక్కులను అ ధిగమించి నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. సెప్టెంబర్ లేదా నవంబర్‌లో నగర పంచాయతీకి ఎన్నికలు ని ర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 2013 నగరపంచాయతీ ఆవిర్భావం నుంచి ఎటువంటి అభివృద్ధి చే పట్టకపోవడం వలన ఎన్నికల్లో ప్రతికూ ల ఫలితాలు వస్తాయనే భావనతో ప్ర భుత్వం నగర పంచాయతీ అభివృద్ధికి సుమారు తొమ్మిది కోట్ల రూపాయల నిధులు విడుదలచేసి సిసిరహదారు లు,సిసి కాలువలు నిర్మాణాలు చేపడుతుంది. నగర పంచాయతీ పేరిట జరజాపుపేటలో అభివృద్ధి పనులు చేపడితే సహించబోమని పనులు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహిస్తే బహిష్కరిస్తామని హెచ్చరిస్తుంది. 50రోజులుగా నగర పంచాయతీని రద్దుకు దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీని రద్దు చేసే వరకు ఉద్యమ బాట పడతామని హెచ్చరిస్తున్నారు.