S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘అల్లూరి పోరాట పటిమ మరువలేనిది’

విజయనగరం(టౌన్), జూలై 4: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని జిల్లా యంత్రాంగం సోమవారం ఆనందగజపతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించింది. జిల్లా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన జయంతి వేడుకలను జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. ఈ సందర్భంగా స్వాతిరాణి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అ ల్లూరి సీతారామరాజు చూపిన పోరాటపటిమ మరువలేనిదన్నారు. కార్యక్రమ ంలో జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్య వాదులను ఎదిరించడంలో అల్లూరి చూపిన ధీరత్వం ఎనలేనిదని కొనియాడారు. మన్యం ప్రజలను స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్ధం చేసిన మహాయోధుడని అన్నారు. ఎమ్మెల్సీ జగదీష్ మాట్లాడు తూ 27 ఏళ్ల వయస్సులోనే బ్రిటీష్ సా మ్రాజ్యవాదులను ఎదిరించిన పోరాడిన అల్లూరి నేటి యువతకు ఆదర్శనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అల్లూరి సీతారామరాజును గుర్తు కు తెచ్చే విధంగా తెలుగువీర లేవరా, రగిలింది విప్లవాగ్ని అంటూ ప్రదర్శించిన నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. అల్లూరి, రూథర్ ఫర్డ్ ఏకాపాత్రాభినాయలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంధ్యారాణి, ఎమ్మెల్యే మీసాల గీత, నారాయణ స్వా మినాయుడు, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, డిఆర్ ఓ జితేంద్ర, డిఇఓ అరుణకుమారి, ఐవిపి రాజు పాల్గొన్నారు.