S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పట్టణాభివృద్ధికి కృషి

బొబ్బిలి, జూలై 4: పట్టణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని, అందుకు పాలకులు, ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ టి.అచ్యుతవల్లి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో ఉన్న 30 వార్డుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. అటువంటి ప్రాంతాలను పరిశీలించి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పట్టణంలో పూర్తి స్థాయిలో కాలువలు, రోడ్లు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యుత్ సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. ఇందిరమ్మకాలనీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ చేయూత అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయుడుకాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. రోడ్లు లేకపోవడంతో నీరు నిల్వ ఉండిపోతోందని కాలనీవాసులు సమస్యలు తెలియజేశారు. వెంటనే చైర్‌పర్సన్ స్పందించి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేశంపార్టీ నాయకులు తూముల భాస్కరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు, కమిషనర్ శంకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.