S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట

విజయనగరం(టౌన్), జూలై 4: మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఐఎంఎ హాలులో ముస్లింలకు రంజాన్ పండుగ తోఫా సరకులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతూ రంజాన్‌ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వానికి మైనారిటీల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఆయన వివరించారు. రంజాన్ పండుగను ముస్లిం కుటుంబా లు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షతో ప్రభుత్వం 350రూపాయలు విలువచేసే పండగ సరకులు ఉచితంగా అందిస్తుందన్నారు. జిల్లాలో ఐదువేల మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా సరకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి పండగ కూడా ముస్లింలకు ఈ పంపిణీని వర్తింపచేస్తామని అన్నారు. రాష్ట్రంలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించడానికి ప్రభుత్వం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ ఆస్తులను తిరిగి బోర్డుకు స్వాధీనం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 20 వేల కోట్ల రూపాయల వ క్ఫ్ ఆస్తులు ఉన్నాయని మంత్రి అన్నా రు. వక్ఫ్ ఆస్తుల మరమ్మతులకు మూ డున్నర కోట్లు కేటాయించామని తెలిపారు. మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న ఇమామ్‌లు, వౌజాన్‌లకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయవాడ, కడప, కర్నూలు పట్టణాలలో హజ్ హౌజ్‌లు ఏర్పాటుకి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, కలెక్టర్ ఎంఎం నాయక్, జెసి శ్రీకేష్ లఠ్కర్, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, జగదీష్, ఎమ్మెల్యే గీత, నారాయణస్వామినాయుడు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గణపతిరావు, డిఎస్‌ఓ నాగేశ్వరరావు ముస్లింలు పాల్గొన్నారు.