S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి

విజయనగరం(టౌన్), జూలై 4: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో వ్యవసాయం, ఉద్యానశాఖ, నీటిపారుదల శాఖ, తాగునీరు, నీరు-చెట్టు, ఉపా ధి పనులపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు కొరతలేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతిని ఆదేశించారు. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు రైతులు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలని నీటి పారుదల శాఖ ఎస్ ఇ రమణకు స్పష్టంచేశారు. గత ఏడాది 34వేల హెక్టార్లకు సాగునీరు ఇచ్చామని ఈ ఏడాది 13వేల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందించనున్నామని ఎస్‌ఇ వివరించారు. నీరు-చెట్టు, చెరువుల పూడికతీత, ఉపాధి హామీపనులు, పంట కుంటల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదలు, అసంఘటిత కార్మికులను చంద్రన్న బీమా పథకంలో చేర్పించి అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహిం చి వ్యాధులు వ్యాపించకుండా ముం దస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగాల నివారణకు వైద్యాధికారులు ముందస్తు వైద్య శిబిరాలు ఏర్పాటు చే యాలని తెలిపారు. మురికి కాలువలు, బావుల వద్ద బ్లీచింగ్ నిర్వహించాలని తెలిపారు. ప్రొటోకాల్ పాటించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు కష్టపడి జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు. ఈసమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతీరాణి, కలెక్టర్ ఎం ఎం నాయక్, జెసి శ్రీకేష్ లఠ్కర్, ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, మీసాల గీత పాల్గొన్నారు.