S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్‌ఆర్‌డిపి స్థల సేకరణకు గ్రహణం

హైదరాబాద్, జూలై 4: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్టుకు సంబంధించి తొలి అడుగు పడాల్సిన కెబిఆర్ పార్కు చుట్టూ స్థల సేకరణ వివాదాస్పదంగా మారుతోంది. కొత్త స్థల సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇచ్చేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధంగా ఉన్నా, యజమానులు కోట్లలో డిమాండ్ చేయటంతో పాటు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కెబిఆర్ పార్కు చూట్టు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్ విగ్రహణ, ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నెం. 45, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ముందున్న కెబిఆర్ పార్కు ఎంట్రెన్స్ వంటి ఆరు జంక్షన్లలో స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. అయితే ఇందులో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాలో ఉన్న ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు నుంచి అయిదు ఎకరాల స్థలముంది. ఇందులో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టుకు సుమారు ఎకరం నుంచి ఒకటిన్నర ఎకరాల స్థలం అవసరమవుతోంది. అంతేగాక, ఎస్‌ఆర్‌డిపి ప్రతిపాదనలకు ముందే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనుమతి ఇచ్చిన జిహెచ్‌ఎంసి అధికారులు ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని కొంతకాలం పనులను నిలిపివేయించారు. ప్రస్తుతం కెబిఆర్ పార్కు చుట్టూ నిర్మించనున్న మల్టేలెవెల్ ఫ్లైఓవర్లకు ఈ జంక్షన్ కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జంక్షన్‌లో ల్యాండ్‌మార్క్ స్థలాన్ని సేకరించాల్సి ఉంది. కానీ వివిధ పేరుగాంచిన కంపెనీలతో కూడిన కన్సార్టియం 2005లో ఈ స్థలాన్ని హెచ్‌ఎండిఏ నుంచి వేలంలో కొనుగోలు చేసింది. ఇపుడు ఎస్‌ఆర్‌డిపి కోసం జిహెచ్‌ఎంసి అధికారులు స్థలాలను అడగ్గా, కన్సార్టియం పెద్ద మొత్తంలో నష్టపరిహారాన్ని కోరటంతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి పలు రకాల మినహాయింపులివ్వాలని కోరినట్లు తెలిసింది. ఇందుకు సముఖంగా లేని జిహెచ్‌ఎంసి ఈ స్థల సేకరణ సమస్య పరిష్కారం కోసం అనే్వషణ ప్రారంభించారు. ఆ స్థల సేకరణ ప్రక్రియను జిహెచ్‌ఎంసి అధికారులు సేకరించని పక్షంలో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అంతేగాక, భూ యాజమాన్యం అయిన కన్సార్టియం కోర్టుకెళితే, ప్రాజెక్టు పెండింగ్‌లో పడే అవకాశముండటంతో ఈ చిక్కుముడిని ఎలా పరిష్కరించుకోవాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోన్నట్లు సమాచారం.