S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అక్రమార్కుల సస్పెన్షన్.. బల్దియాలో దడ

హైదరాబాద్, జూలై 4: మహానగర పాలక సంస్థ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. అంతేగాక, ఒకవైపు అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు వరుసగా దాడులు చేయటం, ఆపై కమిషనర్ ఎంతో పక్కా వ్యూహం, రహస్య నిఘాతో విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి సస్పెన్షన్ వేటు వేయటంతో జిహెచ్‌ఎంసి సిబ్బందిలో హడల్ నెలకొంది. ఎపుడు ఎవరొస్తారో, ఏం దాడులు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొనటంతో గ్రేటర్ కార్యాలయంలోని ప్రతి సిబ్బందిలో డర్ నెలకొంది. ఇప్పటి వరకు విధి నిర్వహణలో విఫలమైన వారిని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిని, అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన మొత్తం పదకొండు మంది అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో సర్కిల్ 11 ట్యాక్సు ఇన్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్, సర్కిల్ 12 ట్యాక్సు ఇన్‌స్పెక్టర్ పద్మభూషణ్, సర్కిల్ 14బిలో ట్యాక్సు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంటు రవీంద్రుడు, సర్కిల్ 11లో బిల్‌కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణ, అదే సర్కిల్ బిల్ కలెక్టర్ నరహరి, సర్కిల్ 12 బిల్ కలెక్టర్ బాబురావు, సర్కిల్ 11 బిల్ కలెక్టర్ జ్ఞానేశ్వర్, సర్కిల్ 11 బిల్ కలెక్టర్ రణ్‌వీర్ భూపాల్‌లను కొంతకాలం క్రితం సైబరాబాద్ ఎస్‌వోటి పోలీసులకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో కమిషనర్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే! వీరితో పాటు సర్కిల్ 5 లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయిన టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ బి. గోపాల్, సర్కిల్ 6 అసిస్టెంటు సిటీ ప్లానర్ పి. బాలానందస్వామి కూడా అక్రమ నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించి, సీతారాంబాగ్‌లోని ఓ గొడౌన్‌లో అగ్నిప్రమాదానికి కారుకుడయ్యాడన్న ఆరోపణతో సస్పెన్షన్ చేశారు. వీరితో పాటు తాజాగా సర్కిల్ 14 పరిధిలో ఆర్వీ గ్యాస్ ఎజెన్సీకి, మారుతీ గ్యాస్ ఎజెన్సీలకు అనుమతిలిచ్చినందుకుఅసిస్టెంటు మెడికల్ ఆఫీసర్ టి. దామోదర్‌ను సోమవారం సస్పెన్షన్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మూడు రోజుల క్రితం సికిందరాబాద్ సర్కిల్ 18 కార్యాలయంలో నిత్యానంద అనే ట్యాక్సు ఇన్‌స్పెక్టర్ కూడా యజమాని పేరు మార్పుకు సంబంధించి ఓ మహిళ నుంచి రూ. 5వేల లంచం డిమాండ్ చేసి ఏసిబి అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే!
ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ దాడులు
ఇప్పటి వరకు వరుసగా పదకొండు మంది వివిధ కారణాలతో సస్పెన్షన్ పాలు కాగా, తాజాగా సోమవారం ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించటం సిబ్బందిని మరింత ఆందోళనకు గురి చేసింది. అలాగే తాజాగా 2007లో హెల్త్ అసిస్టెంట్ల నియామకంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తటంతో విజిలెన్స్ అధికారులు సోమవారం ప్రధాన కార్యాలయంలో దాడులు నిర్వహించటంతో సిబ్బంది హడలెత్తిపోయారు. నియామకాల్లో, పదోన్నతులు భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో ఉన్నతాధికారులు విచారణ నిమిత్తం ప్రత్యేక బృందాలను కూడా నియమించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గతంలో అభ్యర్థులు సమర్పించిన విద్యార్హతల సర్ట్ఫికెట్లు, వారి వయస్సును సైతం ఏ మాత్రం తనిఖీ చేయకుండా పదోన్నతులు కల్పించారన్న విషయం కూడా ఇటీవలే సికిందరాబాద్‌లో కృపదానం అనే ఎస్‌ఎస్ ఏసిబికి చిక్కటంతో భయటపడిన సంగతి తెలిసిందే! కానీ ఎప్పటికపుడు ఒకింత భయపడటం, ఆ తర్వాత బల్దియా..ఖాయా..పీయా..చల్దియా అన్నట్టు మళ్లీ అవినీతికి పాల్పడటం జిహెచ్‌ఎంసిలో మామూలైపోయింది.