S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉప్పల్ భూ నిర్వాసితులకు ప్లాట్లు

ఉప్పల్, జూలై 4: మూసీ ప్రక్షాళన, అభివృద్ధి కోసం స్వాధీనం చేసుకున్న భూములలో తమ వాటా కింద వచ్చే ప్లాట్లను కేటాయించడంలో ప్రభుత్వ నిర్లక్షవైఖిరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.
హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు ఆదేశాల ప్రకారం ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ మధుకర్‌రెడ్డి సోమవారం ఉప్పల్-నాగోల్ రహదారిలోని మాడల్ లేవుట్‌ను సందర్శించారు. రైతు సంఘం, రైతు జెఎసి ప్రతినిధులతో సమావేశమయ్యారు. స్వాధీనం చేసుకున్న భూములెన్ని, ఎంత మంది భూనిర్వాసితులు ఉన్నారు, ఎవరికి ఎంతెంత వాటా కింద స్థలాలు ఇస్తారన్న పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తయారవుతున్న లేవుట్‌లో పెండింగ్ అభివృద్ధి పనులేమిటి, లింక్‌రోడ్లు, విద్యుత్, భూగర్భ డ్రైనేజీ వంటి సమస్యలు ఏమేమి ఉన్నాయో, కోర్టు కేసులు, ఇతర సమస్యలను తెలుసుకున్నారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తిచేసి భూనిర్వాసితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటి కలెక్టర్ మధుకర్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో రైతు సంఘం ప్రతినిధులు దుబ్బ నర్సింహారెడ్డి, మేకల శివారెడ్డి, సల్ల రాజిరెడ్డి, వీరారెడ్డి, మేకల దయాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.