S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచినీటిలో క్లోరిన్ శాతాన్ని పరిశీలించాలి

హైదరాబాద్, జూలై 4: సంజీవ్‌రెడ్డినగర్ డివిజన్-6 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జలమండలి ఎండి ఎం.దానకిషోర్ తనిఖీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ, వెంకటగిరి కాలనీలో సోమవారం ఎండి పర్యటించి నీటి సరఫరా, డ్రైనేజీ వంటి ఇతర సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో చెడిపోయిన డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల వద్ద వెంటనే కొత్తవాటిని ఏర్పాటు చేయాలని, మ్యాన్‌హోల్ కవర్లు లేని చోట కొత్తవాటిని అమర్చాలని ఎండి సూచించారు. అనంతరం ఎండి జూబ్లీహిల్స్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నీటిసరఫరా చేసే రిజర్వాయర్‌కు సంబంధించిన క్లోరినేషన్ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. నీటి సరఫరాలో క్లోరిన్ శాతం తగ్గకుండా, క్లోరినేషన్ ప్లాంట్‌లో క్లోరిన్ సిలిండర్లను అదనంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎండి అధికారులను అదేశించారు.
సెక్షన్‌లకు సంబంధించిన మేనేజర్లు వారి పరిధిలో ఉన్న రిజర్వాయర్ల పర్యవేక్షణ భాద్యతలు కూడా నిర్వహించాలన్నారు. ప్రతి రిజర్వాయర్‌లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని, వర్షాకాలం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇందు కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావు, సిజిఎం ఆజ్మీరాకృష్ణ, జనరల్ మేనేజర్ ఎంబి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.