S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బల్దియా కమిషనర్‌ను కలిసిన చైనా ప్రతినిధుల బృందం

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న 12 మంది సభ్యులతో కూడిన చైనా బృందం సోమవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి కలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్‌ఎంసిలు చేపడుతున్న పలు ప్రధాన అభివృద్ధి పనుల్లో తాము భాగస్వాములయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రతినిధుల బృందం సానుకూలతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. చైనా నగరంలోని ప్రముఖ నగరమైన చంగ్‌షా మున్సిపల్ కార్పొరేషన్ అటాన్స్‌పోర్టు విభాగం డైరెక్టర్ లియుమింగ్లీ, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టెటీవ్ విదేశఈ వ్యవహారాల డైరెక్టర్ జీలిహ్వా, చంగ్‌షా నగరం కామర్స్ బ్యూరో వైస్ డైరెక్టర్ పెంగ్‌కజియా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి హైదరాబాద్ నగరంలోని ప్రజారవాణా వ్యవస్థ రంగంపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ దాదాపు ఆరువేల కోట్ల ప్రతిపాదిత అంచనా వ్యయంతో నగరంలోని మూసీ నదిపై ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనిలో భాగస్వాములు కావాలని ఆయన ప్రతినిధులను కోరారు. హైదరాబాద్ నగరంలో 9వేల కిలోమీటర్ల రోడ్ల విస్తీర్ణం ఉందని, ఈ రోడ్ల నిర్వహణ, మరమ్మతులు తదితర పనుల నిర్వహణను ప్రైవేటు ఎజెన్సీల ద్వారా చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఈ రంగంలో కూడా భాగస్వాములు కావాలని చైనా ప్రతినిధుల బృందాన్ని కమిషనర్ కోరారు. వీటితో పాటు 400 సంవత్సరాల చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరంలో పర్యాటక, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి రంగంల కూడా విస్త్రృత అవకాశాలున్నాయని వారికి వివరించారు. వీటితో పాటు గనంరలో దాదాపు 26వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని, ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని వారికి వివరించారు. అన్యూటీ ప ద్దతిలో ఈ ప్రాజెక్టులు చేపట్టవచ్చునని కమిషనర్ వారికి సూచించారు. సమావేశంలో చంగ్‌షా నగర ప్లానింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్‌తో పాటు పలు కంపెనీల ప్రతినిధులు కమిషనర్‌ను కలిసినవారిలో ఉన్నా వీరితో పాటు జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ సురేందమోహన్ ఉన్నారు.