S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఎదలో విసిరిన ఇంధ్రదనుస్సు రుబాయి’ కావ్యం ఆవిష్కరణ

ముషీరాబాద్, జూలై 4: రసమయి, యువభారతి సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ సుధానిధి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య రచన ఎదలో విసిరిన ఇంధ్రదనుస్సు రుబాయి కావ్యం ఆవిష్కరణ సభ సోమవారం సాయంత్రం చిక్కడిపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి ముఖ్యఅతిథిగా హాజరై కావ్యాన్ని ఆవిష్కరించి ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్యకు అంకితమిచ్చారు. యువభారతిచే డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యకు తెలుగు రుబాయి కవి సామ్రాట్ బిరుదు ప్రధానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్వీ రామారావు, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, యువభారతి సమావేశకర్త ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాధం, యువభారతి సంపాదకులు సుధామ, రసమయి, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంకె రాము, అధ్యక్షులు డాక్టర్ మాడభూషి అనంతచార్య పాల్గొన్నారు.
ఆసక్తికరంగా ఆత్మకథా తరంగాలు
విశ్వసాహితి, శ్రీత్యాగరాయగాన సభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కళా సుబ్బారావు కళావేధికలో నిర్వహించిన ఆత్మకథా తరంగాలు కార్యక్రమంలో వక్తల ప్రసంగాలు ఆసక్తికరంగా కొనసాగాయి. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పోతుకూబి సాంబశివరావు సభాధ్యక్షతలో గానసభ అధ్యక్షుడు డాక్టర్ కళావెంకట దీక్షితులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టర్ పోతుకూచి ఉమాభట్టేశ్వర్‌శర్మ, డాక్టర్ బి.జయరాములు, డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి, మంగళగిరి ప్రమీలాదేవి, జి.సీత పాల్గొన్నారు.