S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాతావరణ సమతుల్యతను కాపాడేవి చెట్లు

వికారాబాద్: వాతావరణ సమతుల్యతను కాపాడేవి చెట్లను అందుకే మొక్కలు నాటాలని ఎక్సైజ్ సూపరిండెంటెంట్ పి.దశరథం అన్నారు. సోమవారణ హరితహారంలో భాగంగా వికారాబాద్ మండలం సిద్దులూర్ గ్రామంలో పాపయ్య పొలంలో ఈతమొక్కలను నాటారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ శాఖ తరఫున ఈత. ఖర్జూర మొక్కలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో గౌడ సంఘాలు వేరే దగ్గర నుండి మొక్కలు తెచ్చుకునేవారని, ఇపుడు శాఖ పరంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు చెట్లు ఎంతో అవసరమని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతున్నారని, మొక్కల రవాణ సైతం ఉచితంగా ఇస్తున్నామని, మొక్కల సంరక్షణ, పెంచే బాధ్యతను సైతం శాఖ తీసుకుందని అన్నారు. ఎక్సైజ్ శాఖ, గౌడ సంఘాలు సంయుక్తంగా కృషి చేస్తే చెట్లు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. తరతరాల వృత్తిని కాపాడుకోవడంతో పాటు స్వచ్చమైన కల్లును అందించవచ్చని స్పష్టం చేశారు. రాజేంద్రగన్ పరిధిలో రెండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని అందులో భాగంగా లక్షా 60 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 55 వేల గుంతలు తీయగా, ఇప్పటి వరకు 36వేల మొక్కలు నాటామని, జూలై 11న 30 వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. శంకర్‌పల్లి, చేవెళ్ల, శంషాబాద్ ప్రాంతాల్లో 20 వేల మొక్కలు నాటనున్నామని తెలిపారు. తాతలు ఇచ్చిన చెట్ల సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. వికారాబాద్ ఎక్సైజ్ సిఐ బి.సుధాకర్ మాట్లాడుతూ ఆరు గ్రామాల్లో 10900 మొక్కలు నాటనున్నామని చెప్పారు. సిద్దులూర్‌లో 800, గొట్టిముక్లలో 500, మద్గుల్‌చిట్టంపల్లిలో 1000, మైలార్‌దేవరంపల్లిలో 300, పుల్సుమామిడిలో 500, పుల్‌మద్దిలో 1000 మొక్కలు నాటనున్నారని తెలిపారు. సమావేశంలో సిద్దులూర్ సర్పంచ్ గౌసొద్దీన్, ఎక్సైజ్ ఎస్‌ఐలు ప్రభాకర్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.