S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

2015 స్పెషల్ డిఎస్‌సి ఫలితాలు విడుదల

ఏలూరు, జూలై 4: జిల్లాలో 2015 స్పెషల్ డిఎస్‌సి ఫలితాలను కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ సోమవారం విడుదల చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రాధమిక విద్యాశాఖ 2015లో నిర్వహించిన స్పెషల్ డిఎస్‌సి ఫలితాల సిడిని ఆయన విడుదల చేశారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన స్పెషల్ డిఎస్‌సి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చామని, 206 ఉపాధ్యాయ పోస్టులకు 1096 మంది హాజరయ్యారని, వారి మార్కుల వివరాలతో సహా పొందుపర్చటం జరిగిందని ఆయన తెలిపారు. స్పెషల్ గ్రేడ్ టీచర్ 162 పోస్టులకు 58 హాజరయ్యారని, 15 ఎల్‌పి హిందీ టీచర్లకు 153మంది, 10 ఎల్‌పి తెలుగుటీచర్ల పోస్టులకు 137మంది, స్కూల్ అసిస్టెంటు హిందీ ఒక పోస్టుకు 66మంది, స్కూల్ అసిస్టెంటు తెలుగు రెండు పోస్టులకు 107మంది, స్కూల్ అసిస్టెంటు సోషల్ స్టడీస్ 5పోస్టులకు 329మంది, స్కూల్ అసిస్టెంటు బిఎస్ మూడుపోస్టులకు 101మంది, స్కూల్ అసిస్టెంటు ఇంగ్లీషు రెండు పోస్టులకు 33మంది, స్కూల్ అసిస్టెంటు పిఎస్ ఒక పోస్టుకు 13మంది, స్కూల్ అసిస్టెంటు లెక్కలు అయిదు పోస్టులకు 99మంది హాజరయ్యారని తెలిపారు. హాజరైనవారందరికి లభించిన మార్కులు ఆన్‌లైన్‌లో పొందుపర్చామని, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, అసిస్టెంటు కలెక్టరు ఎం అబిషిక్త్ కిషోర్, డిఆర్వో కె ప్రభాకరరావు, డిఇఓ మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.