S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెన్యువల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఏలూరు, జూలై 4 : ఈ ఆర్ధిక సంవత్సరం ఇంటర్మీడియట్ స్థాయి నుండి పిజి స్థాయి వరకూ స్కాలర్‌షిప్‌లు పొందే విద్యార్ధినీ విద్యార్ధులకు రెన్యువల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకునేందుకు చర్యలు తీసుకోవాలని జెసి-2 మహ్మద్ షరీఫ్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు. సోమవారం స్థానిక సి ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపల్స్‌తో జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ స్కాలర్‌షిప్‌లు పొందే ఎస్ సి, ఎస్‌టి, బిసి, ఓసి విద్యార్ధులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం పొందేందుకు విధిగా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా తమ పేర్లు రెన్యువల్ చేయించుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కాలేజీ ప్రిన్సిపల్స్ ప్రత్యేక చర్యలు చేపట్టి ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా సక్రమంగా విద్యార్ధినీ విద్యార్ధుల పేర్లు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, ఆధార్‌కార్డు వివరాలు, ఇన్‌కమ్ వివరాలు నమోదు చేసి అర్హత గల ప్రతీ విద్యార్ధికీ స్కాలర్‌షిప్‌లు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కాలేజీలు రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రిన్సిపల్స్‌కు సూచించారు. విద్యార్ధులు కాలేజీలో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు విధానం ద్వారా అటెండెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని దీని ద్వారా విద్యార్ధి క్రమశిక్షణతో మంచిగా చదువుకునే అవకాశం, కాలేజీకి తప్పకుండా హాజరయ్యేందుకు విద్యార్ధులకు వీలవుతుందని తద్వారా విద్యార్ధుల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. హాస్టల్స్‌లో చదివే విద్యార్ధులు 80 శాతం కంటే హాజరు తక్కువైతే తల్లిదండ్రులకు తెలియబరచాలని అవసరమైన పరిస్థితుల్లో హాస్టల్ నుండి పంపేయడం కూడా జరుగుతుందని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్ధులు నేర్చుకోవాలని తెలిపారు. పేద విద్యార్ధినీ విద్యార్ధులకు అన్యాయం జరగకుండా అర్హత గల ప్రతీ ఒక్కరికీ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని చెప్పారు. విదేశాల్లో చదువుకోవాలనే పేద విద్యార్ధులకు ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. అంగవైకల్యం కలిగిన విద్యార్ధులకు కూడా స్కాలర్‌షిప్‌లకు దరకాస్తులు చేసుకోవచ్చునని నిబంధనలకు విరుద్ధంగా అంగవైకల్యం లేని ఓసి విద్యార్ధులు కూడా స్లాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేస్తున్నారని అర్హత కలిగి ఉంటే తప్పనిసరిగా ఓసి విద్యార్ధినీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతిభావంతుల శాఖ ఎడి ప్రసాదరావు చెప్పారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జి రంగలక్ష్మిదేవి, డి ఎస్‌డబ్ల్యువో టి సాల్మన్‌రాజు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఆర్ రవికుమార్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి లక్ష్మీప్రసాద్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరెడ్డి, ఆర్‌ఐవో ఎస్‌ఎ ఖాదర్, డివిఇవో కె వెంకట్రామయ్య, జిల్లాలోని ప్రైవేటు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.