S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలి

ఏలూరు, జూలై 4: బ్రిటీష్ పాలకుల నిరంకుశ వైఖరిపై నిరంతరం పోరాటం చేసిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. అల్లూరి 119వ జయంతి సందర్భంగా స్ధానిక కలెక్టరేట్‌లోని అల్లూరి విగ్రహానికి సోమవారం కలెక్టరు భాస్కర్, జెసి కోటేశ్వరరావు, జెసి-2 షరీప్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ చిన్నప్పటినుండే గిరిజన పేదల హక్కుల సాధన కోసం ముఖ్యంగా అమాయక గిరిజనుల శ్రేయస్సు కోసం అల్లూరి తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించినప్పుడే ఆర్ధిక అభివృద్ధి సాధ్యపడుతుందని, సీతారామరాజు ఆశయాన్ని అమలుచేయడానికి ప్రతిఒక్కరూ నేడు ప్రతిన పూనాలన్నారు. కార్యక్రమంలో డిఆర్వో కె ప్రభాకరరావు, ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్, జడ్పీ సిఇఓ సత్యనారాయణ, భూసేకరణ ఎస్‌డిసి సూర్యనారాయణ, డిపిఓ కె సుధాకర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసచౌదరి, ట్రాన్స్‌కో ఎస్‌ఇ సత్యనారాయణరెడ్డి, సమాచారశాఖ ఎడి వి భాస్కరనరసింహం పాల్గొన్నారు.