S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజాసాధికారిత సర్వేకు 2581 బృందాలు

ఏలూరు, జూలై 4 : జిల్లాలో 39 లక్షలకు పైగా ఉన్న జనాభా సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజాసాధికారిత సర్వే (పల్స్ సర్వే)కు 2581 బృందాలను సిద్ధం చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం మండల తహశీల్దార్లు, ఎంపిడివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పల్స్ సర్వే ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సర్వేకు 258 మంది సూపర్‌వైజర్లను నియమించామని ఒక్కొక్క సూపర్‌వైజరు పరిధిలో పది మంది ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేమని ప్రతీ ఎన్యూమరేటర్‌కు ఇంటర్నెట్‌తో కూడిన మిని ట్యాబ్‌లను అందించామని ఆయన చెప్పారు. ఎన్యూమరేటర్లు జిల్లాలోని ప్రతీ ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించి దాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని దీని వలన జిల్లాలో ప్రజల జీవన స్థితిగతులు వారి ఆస్థి వివరాలు, విద్యార్హత, ఉపాధి పొందుతున్న వారి వివరాలు, చదువుతున్న వారి సమగ్ర సమాచారం పూర్తిస్థాయిలో సేకరించగలుగుతామని దీని వలన భవిష్యత్తులో ఏ ఏ చర్యలు చేపడితే ప్రజల జీవన స్థితిగతులు మరింత మెరుగుపడతాయో స్పష్టమైన సమాచారం ప్రభుత్వానికి లభిస్తుందని చెప్పారు. ప్రతీ మండల తహశీల్దారు తమ పరిధిలో ఈ బృందాలు ఇంటింటా తిరిగి సమగ్ర సమాచారాన్ని ఏకరిస్తున్న తీరు వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లాలో సమగ్ర సమాచారం సేకరించడానికి నూతన యాప్‌ను ప్రభుత్వం సిద్ధం చేసిందని రేపటికల్లా కొత్త యాప్ అన్ని టాబ్‌లలో పొందుపర్చడం జరుగుతుందని దాని ద్వారా ప్రభుత్వం ఆశించిన సర్వే ఫలితాలను రాబట్టడంలో ఎన్యూమరేటర్లు శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లాలో సాంకేతికంగా ఏమైనా సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు తగు చర్యలు తీసుకున్నామని ఏ ఒక్కరూ కూడా సర్వే విషయంలో ఎటువంటి అపోహలకు గురికావాల్సిన పనిలేదని ఆయన కోరారు. ఈ సర్వేలో వాస్తవ వివరాలు వెల్లడిస్తే రేషన్‌కార్డు రద్దవుతుందో, పెన్షన్లు తొలగిస్తారో అనే అపోహలు విడనాడాలని ఈ సర్వే వల్ల ఏ ఒక్క తెల్లరేషన్‌కార్డుకానీ, పెన్షన్ కానీ తొలగించడం ఉండదని ఈ విషయంలో ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాలని అప్పుడే సమగ్ర సర్వేకు సార్ధకత చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో డి ఆర్‌వో కె ప్రభాకరరావు, డి ఎస్‌వో కె శివశంకర్‌రెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ ఆర్‌వి సూర్యనారాయణ, ఏలూరు ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్, ఎన్ ఐసి అధికారి శర్మ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గంగరాజు, డి ఆర్‌డి ఏ ఎపిడి సిహెచ్ అప్పారావు, దొర పాల్గొన్నారు.