S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోడలి ఆత్మహత్య

తలుపుల, జూలై 4: అత్తింటివారు పెట్టే వేధింపులు తట్టుకోలేక కోడలు రమణమ్మ(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని చంద్రేనాయక్ తండాలో జరిగింది. ఇందుకు సంబందించిన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు ఇలా వున్నాయి. చిత్తూరు జిల్లా పెద్దమండెం మండలం వడ్డివంకతండాకు చెందిన బుక్కే పక్కీర్‌నాయక్, ఎల్లమ్మల కుమార్తె రమణమ్మ(22)ను మూడున్నర ఏళ్ల క్రితం తలుపుల మండలం చంద్రేనాయక్ తండాకు చెందిన మూడే రామాంజినాయక్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొన్నాళ్లు సంసారం సాఫీగానే సాగింది. అయితే ఇటీవల అత్త ముత్యాలమ్మ, మామ బాలేనాయక్, భర్త రామాంజినాయక్ చీటికి మాటికి వేధిస్తుండడంతో తట్టుకోలేక రమణమ్మ సోమవారం ఉదయం గ్రామానికి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రమణమ్మకు ఎనిమిది నెలల వయస్సు గల కుమారుడు వున్నారు. కాగా మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గోపాలుడు మృతురాలి భర్త రామాంజినాయక్, అత్త ముత్యాలమ్మ, మామ బాలేనాయక్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.