S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

తాడిమర్రి, జూలై 4: రాష్ట్ర వ్యాప్తం గా నిరుపేదల ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కునుకుంట్ల కిశోర్ నూతనంగా మీ-సేవా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో దురదృష్ట పాలనతో ఇష్టానుసారంగా ప్రజా సౌకర్యాలను పక్కకు నెట్టి కొంతమంది స్వార్థపరులు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి రాష్ట్ర భవిష్యత్తును అప్రతిష్టపాలు చేశారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందించే దిశగా మీసేవ ద్వారా రెవె న్యూ, పోలీసు, ఆరోగ్యశ్రీ, విద్య, స్కా లర్‌షిప్‌లాంటి 128మెరుగైన సేవలు ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. మండలంలోని 476మంది ముస్లిం సోదరులకు ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా సరుకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ముస్లింలకు రూ.8.50 లక్షలతో స్మశానవాటిక, రూ.4 లక్షలతో దర్గా, గతంలో 33 సెంట్లకే పరిమితమైన ఈద్గా మైదానం చుట్టూ ప్రభుత్వ భూమిని రంజాన్ పండుగ కానుకగా అందజేయాలని తహశీల్దార్ సుబ్బలక్ష్మిని ఆదేశించారు. మండలంలో ముస్లింలకు షాదీఖానా కోసం నివేదికలు తయారుచేసి పం పామని, నిధులు మంజూరు కాగానే షాదీఖానా నిర్మిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1.50 లక్షల మొక్క లు రోడ్డుకు ఇరువైపులా నాటాలని, ప్రతి ఇంటికి 5 మొక్కలు చొప్పున పంపిణీ చేస్తామన్నారు. మం డలంలోని అన్ని చెరువులకు రానున్న రెండేళ్ల లోపు పిఎబిఆర్ నీటిని తప్పకుండా అందజేస్తామని హామీ ఇచ్చా రు. టిడిపి మండల కన్వీనర్ ధనుంజయ, మాజీ కన్వీనర్లు కొడిదల రాజశేఖర్, మల్లప్పగారి కేశవరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, టిడిపి సీనియర్ నాయకులు ఆదినారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పాపానాయుడులతోపాటు నేతలు రామానాయుడు, భాస్కర్, హాజీ, అల్లాబకాష్, ముతవల్లి ఇస్మాయిల్, కార్యదర్శి మహబూబ్‌బాషా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.