S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాడి రైతుల హైవే దిగ్బంధం

రాప్తాడు, జూలై 4: మండల కేం ద్రంలోని స్థానిక 44వ జాతీయ రహదారిపై రైతు సంఘం అధ్యక్షులు రామయ్య ఆధ్వర్యంలో పాడి రైతులు సిపిఎం, సిపిఐ, వైకాపా నాయకులు పాడి రైతులకు మద్దతుగా సోమవారం హైవేపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండలాధ్యక్షులు రామాంజనేయులు మా ట్లాడుతూ పాడి రైతులు ఎన్నో ఇబ్బందులుపడి డెయిరీకి పాలను సరఫరా చేస్తున్నారని, అలాంటి వారికి పాల బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని, వెంటనే పాలబకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. దాదాపుగా 3నెలల నుంచి బకాయిలు చెల్లించలేదని, ఈ విధంగా వుంటే పాడి రైతులు ఎలా అభివృద్ధి చెందుతారని ఆయన తెలిపారు. దాదాపు రూ.20 కోట్లు తక్షణం ఇచ్చి కరువులో వున్న రైతులను ఆదుకోవాలని, సిబ్బందికి జీతాలు చెల్లించాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పెరుగు, పాల పౌడర్ పరిశ్రమలు స్థాపించాలని, పాల ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలు ప్రతి గ్రామంలో, పట్టణంలో ఏర్పాటుచేయాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రా లు, హాస్పిటల్స్‌లో విజయ పాలు సరఫరా చేయాలని సూచించారు. పాల ధరలు తగ్గించారని, జిల్లా కరవు దృష్ట్యా పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా లీటరుకు రూ.4లు ప్రోత్సాహకం ఇవ్వాలని పేర్కొన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ధరణిబాబు జాతీయ రహదారిపై ధర్నా చేయకూడదని, వెంటనే వారందరిని అరెస్టు చేసి పూచికతుపై వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, రైతు సంఘం నాయకులు కదిరప్ప, నాగరాజు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు రామాంజనేయులు, మల్లికార్జున, శేఖర్, కొండన్న, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.