S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలీసులు పదవీ విరమణ చేసినా సంక్షేమం చూస్తాం

అనంతపురం సిటీ, జూలై 4: ప్రజలను రక్షించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు రిటైర్డ్ అయ్యాక కూ డా సంక్షేమం పోలీసు శాఖ చూస్తుందని ఎస్పీ ఎస్‌వి.రాజశేఖర్‌బాబు వెల్లడించారు. జిల్లాలో పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ జూన్ 30న పదవీ విరమణ పొందిన 14 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యో గం అన్ని శాఖలకంటే భిన్నమైనదని ఎందుకంటే నిత్యం ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు పంచుకునే వీలుంటుందన్నారు. అదే సమయంలో ఒత్తిళ్లు కూడా అధికంగా ఉంటాయన్నారు. తద్వారా రో గాల భారినపడే అవకాశం ఉందని, అందుకే పదవీ విరమణ పొందే నాటికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మిగలడం ఒక అదృష్టంగా పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన వారంతా ఉన్నతాధికారుల మన్ననలు పొంది పోలీసు శాఖకు మంచి సేవలు అందించారని ప్రశంసించారు. పదవీ విరమణ పొందిన వారందరు శేష జీవితం ప్రశాంతంగా, సుఖమయంగా ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ఎఎస్పీ మాల్యా ద్రి, ఐ వెంకటేసులు, డిఎస్పీలు మల్లికార్జున వర్మ, మున్వర్ హుస్సెన్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు త్రిలోక్‌నాథ్, గోరంట్ల మాధవ్, సభ్యులు సుధాకర్‌రెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.