S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

అనంతపురం కల్చరల్, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ, దాడుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు అమాయక ప్రజలను బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సామ్రాజ్యవాద దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారి విధానాల కారణంగా ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రమయ్యాయని, దీనితో ఉగ్రవాద సంస్థల వైపు నిరుద్యోగ యువకులు ఆకర్షితులవుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిఘా ఏర్పాటుచేసి ఉగ్రవాద చర్యలను నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా కమిటీ సభ్యులు నల్లప్ప, బిహెచ్.రాయుడు, ఆర్‌వి.నాయుడు పాల్గొన్నారు.