S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్పోర్ట్స్ హబ్‌గా కడప..

కడప,జూలై 4: జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కడప ఆఫీసర్స్‌క్లబ్‌లో వార్షిక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ధృడ సంకల్పంతో ఉందన్నారు. కడప జిల్లాను రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అన్ని సౌకర్యాలు ఉన్న క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామన్నారు. అందుకు ప్రణాళికతో ప్రతిపాదనలు సమర్పిస్తే ప్రభుత్వానికి పంపుతామన్నారు. అలాగే కడప ఆఫీసర్స్ క్లబ్ తక్కువ వైశాల్యంలో ఎక్కువ క్రీడా విభాగాలు ఉన్నాయని, ఇది ప్రశాంత వాతావరణం లేకుండా ఇరుకైన ప్రదేశంగా ఉందని అనువుగాలేదని చెప్పారు. కొత్తగా ఆఫీసర్స్‌క్లబ్ నిర్మాణానికి ప్రణాళికతో ప్రతిపాదనలు సమర్పిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. టేబుల్ టెన్నిస్‌కు ఒక టేబుల్ మాత్రమే ఉందని, రెండవ టేబుల్ ఏర్పాటుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జాతీయ, రాష్టస్థ్రాయిలో జరిగే క్రీడలను కడప జిల్లాలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కడప ఆఫీసర్స్ క్లబ్ 1932వ సంవత్సరంలో స్థాపించబడిందని అప్పటి క్రీడలకు ఈ క్లబ్ వైశాల్యం సరిపోయి ఉండేదన్నారు. కాని ప్రస్తుతం క్రీడలు ఎక్కువగా ఉన్నందున క్లబ్ వైశాల్యం సరిపోవడం లేదన్నారు. అందుకుగాను క్రీడలకు అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని గుర్తించి సూచిస్తే క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే క్లబ్ ఆదాయం పెరిగేందుకు కొత్తగా సభ్యులను చేర్చుకోవాలని తన వంతు సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కార్యదర్శి ఎంపికను చేయాల్సివుందని సభ్యులు కోరగా, తుది నిర్ణయం తీసుకుని, తన దృష్టికి తీసుకునివస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఆఫీసర్స్‌క్లబ్ కార్యదర్శి గోపాల్, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, జానుమద్ది విజయభాస్కర్, బివి రమణ, హరిప్రసాద్ పాల్గొన్నారు.