S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుదుట బడిన మాదాల రంగారావు ఆరోగ్యం

తిరుపతి, జూలై 4: గత కొంత కాలంగా స్పాండిలైటిస్ వ్యాధితో బాధపడుతూ బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు మాదాల రంగారావు ఆరోగ్యం కుదుట పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తెలిపారు. బర్డ్‌లో ఉన్న మాదాల రంగారావును సిపిఐ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్ర సినిమాల హీరోగా, ప్రజా ఉద్యమాల నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మాదాల రంగారావు, మాజీ ప్రజానాట్యమండలి నాయకులు డాక్టర్ మురళీమోహన్ సూచనల మేరకు చికిత్స నిమిత్తం బర్డ్ ఆసుపత్రికి చేరారన్నారు. బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్‌తో మాదాల ఆరోగ్యానికి సంబంధించి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ చర్చించారన్నారు. ఈ నేపథ్యంలో బర్డ్ డాక్టర్లు ఆయనకు అద్భుతమైన వైద్యం అందించారన్నారు. అదే సమయంలో శ్వాస వ్యాధి కూడా రావడంతో స్విమ్స్‌లో డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ శివశంకర్, డాక్టర్ కృష్ణారెడ్డి మెరుగైన వైద్యం అందించడంతో ఆయన త్వరగా కోలుకున్నారన్నారు. ఆరోగ్యం కోలుకోగానే తిరిగి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతారన్నారు. ఈ సందర్భంగా మాదాల రంగారావు మాట్లాడుతూ నా ఆరోగ్యం కుదుట పడిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, వదంతులు నమ్మవద్దని ఆయన అభిమానులను, ప్రజలను కోరారు.