S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య రద్దీ

శ్రీకాళహస్తి, జూలై 4: శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్యకావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి, రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి భక్తులు ఒక్కసారిగా రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇటీవల ఇఓ భ్రమరాంబ లోపల క్యూలైన్లను మార్పులు చేయడం వల్ల భక్తులు క్యూలైన్లలోకి వెళ్లలేకపోయారు. దీంతో స్థలం లేకపోవడంతో బజారువీధిలోకి క్యూలైన్ చేరింది. ఎండకు ఇబ్బందులు పడుతూ వాహనాల రాకపోకల శబ్ధాలతో రోడ్డుపైన నిలబడలేక భక్తులు అవస్థలకు గురయ్యారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో భక్తుల కష్టాలు రెట్టింపయ్యాయి. అమావాస్య ఘడియల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే, పూజలు చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకంతో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు కూడా ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారుల నిర్వాకం వల్ల భక్తులు అవస్థలకు గురయ్యారు. సాయంత్రం తరువాత రద్దీ తగ్గింది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తీసుకున్న వాళ్లు కూడా ఒకే క్యూలైన్‌లో వెళ్లడంతో త్వరగా దర్శనం చేసుకోలేకుండాపోయారు. అందర్నీ ఒకే క్యూలైన్‌లో కలుపుతుండటం వల్ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఎందుకు అమ్ముతున్నారో అర్థం కావడం లేదని భక్తులు వాపోయారు. అడిగిన భక్తులకు సమాధానం చెప్పే అధికారులు కూడా అందుబాటులో లేకుండాపోయారు. మొత్తం మీద అధికారులు తీసుకున్న క్యూలైన్ల మార్పు అనే అనాలోచిత నిర్ణయం వల్ల భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి.