S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

12 నుంచి కంచి స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ఒంగోలు అర్బన్, జూలై 4 : ఒంగోలులోని టిటిడి కల్యాణ మండపంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో కంచిపీఠం స్వాములు జయేంద్ర సరస్వతి మహాస్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆగమన ఆహ్వానానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మూడు రోజుల పాటు స్వామి వార్లు అందుబాటులో ఉండి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ప్రతి రోజూ కంచిపీఠ పూజతో పాటు స్వామి వారి అభిభాషణ ఉంటుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఆషాడశుద్ధ అష్టమిని పురస్కరించుకుని 12వతేది మంగళవారం నుండి 14వ తేది గురువారం వరకు కంచి పీఠాధిపతులు భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తారన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ ఈనెల 12వ తేది మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష అర్చనలు, అభిషేకాలు,అనుగ్రహ భాషణం, తీర్ధ ప్రసాదాల వినియోగాలు ఉంటాయన్నారు. సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేష అర్చన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 13వ తేది బుధవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష అర్చనలు, అభిషేకాలు, అనుగ్రహ భాషణం, తీర్థ ప్రసాదాల వినియోగం , సాయంత్రం ఆరు గంటల నుండి 8.30 గంటల వరకువిశేష అర్చనలు జరుగుతాయన్నారు. 14వ తేది గురువారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష అర్చనలు, అభిషేకాలు, అనుగ్రహ భాషణం, తీర్థ ప్రసాదాలు ఉంటాయన్నారు. ప్రజలందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి పాద సేవకులు అళహరి చెంచలరావు, దేవాదాయ శాఖ ఎసి వెండిదండి శ్రీనివాసరెడ్డి, పారిశ్రామికవేత్త కె శ్రీనివాసరావు పాల్గొన్నారు.