S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈపోస్‌తో అర్హులకు సంక్షేమ పథకాలు

హనుమాన్ జంక్షన్, జులై 4: దేశంలో తొలిసారిగా కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈపోస్ విధానంతో అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ బాబు ఎ కేంద్ర బృందానికి వివరించారు. జిల్లాలో ఈపోస్ విధానాన్ని పరిశీలించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం సోమవారం గన్నవరం నియోజకవర్గంలో పర్యటించింది. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం పెరికీడు, ఆరుగొలను గ్రామాలలో ఈపోస్ అమలుతీరును క్షేత్ర స్థాయిలో బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు పెరికీడులో ఆధార్ అనుసంధానంతో జిల్లాలో పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువులు, ఎరువులు, వృద్ధాప్య, వింతతు, వికలాంగ పింఛన్లు, మ్రైకో ఎటియం ద్వారా నగదు బదిలీ వంటి అంశాలను బృందానికి తెలిపారు. ఆరుగొలను పంచాయతీ కార్యలయంలో 10 ఈపోస్ యంత్రాలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడటంతోపాటు నిత్యావసరాల పంపిణీ విధానాన్ని ప్రదర్శించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆధార్ సంఖ్యను నమోదు చేయడం ద్వారా పంపిణీ చేస్తున్న ఈ ఎరువుల విధానం సభ్యులు తిలకించారు. గ్రామంలోనే బృంద సభ్యులు ప్రజా సాధికారిత సర్వేను జిల్లా కలెక్టర్ బాబు, ఆధార్ డైరెక్టర్ అజయ్‌భూషణ్ పాండే కుటుంబ సభ్యుల వివరాలను, గంణాంకాలను మోబైల్ ఎప్ ద్వారా నమోదు చేశారు. కలెక్టర్ సమక్షంలో స్ధానిక డీలర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన రంజాన్ తోఫాను లబ్ధిదారునికి అందించారు.