S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేదల గుండె చప్పుడు ‘రంగా’

మచిలీపట్నం, జూలై 4: వంగవీటి మోహన రంగా పేద ప్రజల గుండె చప్పుడని, దానికి చావు లేదని రంగా తనయుడు, వైఎస్‌ఆర్ సిపి నాయకుడు వంగవీటి రాధా అన్నారు. రంగా అంటే ఒక కుల నాయకుడు కాదన్నారు. కులం ఆయన బలం మాత్రమేనన్నారు. ఆ బలం పది మందికి మేలు చేకూరేలా ఉంటుందే తప్ప హాని చేకూర్చదని అభిమానుల హర్షధ్వానాల మధ్య అన్నారు. స్థానిక నిజాంపేటలో ఇటీవల కూల్చివేతకు గురై రంగా విగ్రహ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని సోమవారం రాత్రి రాధా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనడం విశేషం. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పిళ్ళా వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధా మాట్లాడుతూ రంగా విషయంలో పార్టీలు, కులాలు ఏమీ లేవన్నారు. తెలిసిందల్లా ఒక్క అభిమానమేనన్నారు. రంగాని ఎవరు అభిమానించినా నెత్తిన పెట్టుకుని చూసుకునే అభిమానులు ఉన్నారన్నారు. పేదవాడి గుండె చప్పుడు రంగా అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అణగతొక్కబడిన వర్గాల అభ్యున్నతికి రంగా ఆనాడే పాటు పడ్డారన్నారు. చెప్పులు కుట్టుకునే వాడిని, జిలేబి అమ్ముకునే వాడిని, సినిమా హాలులో టిక్కెట్లు అమ్మే వాడిని కార్పొరేటర్లని చేసిన ఘనత రంగాకే దక్కుతుందన్నారు. చెయ్యి చెయ్యి కలుపు చేజారదు గెలుపు అని ఆ నాడే రంగా పిలుపునిచ్చారని, ఆ పిలుపు నేటికీ ఆయన అభిమానుల రూపంలో కొనసాగుతుండటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పేద వర్గాల కోసం బలైపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది రంగా ఒక్కరేనన్నారు. పేదల కోసం పోరాడుతున్న రంగాను ఆ నాడు కొన్ని శక్తులు హతమార్చాయన్నారు. అన్ని వర్గాల్లో రంగాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రంగా విగ్రహాన్ని కొన్ని దుష్టశక్తులు ధ్వంసం చేశాయన్నారు. ఆ రోజు రంగా జయంతి నాటికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పామని, ఆ మాట మేరకే రంగా అభిమానుల సహకారంతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రంగా సోదరుడు రాధా తనకు మంచి ఆప్తుడన్నారు. విజయవాడలో నాకు ఏ పని కావాలన్నా రాధా సాయం తప్పనిసరిగా తీసుకునే వాడన్నారు. రాధా-రంగా కుటుంబంతో అంతటి అవినాభావ సంబంధాలు తనకు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య మాట్లాడుతూ కాపుజాతి ప్రతీక రంగా అన్నారు. జాతి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన ధైర్యశీలి, త్యాగశీలి రంగా అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రంగా విగ్రహాన్ని కూల్చి వేసిన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని కోరారు. కొంత మంది అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, కాపు నాడు నాయకులు, వేలాది మంది రంగా అభిమానులు పాల్గొన్నారు. తొలుత మూడు స్థంభాల సెంటరు నుండి పట్టణ పుర వీధుల్లో వందలాది మోటారు సైకిళ్ళతో రాధా ర్యాలీగా విగ్రహ స్థలికి చేరుకుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.