S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోన్‌లో మెస్సేజ్.. పెన్షన్ ‘మిస్’ప్లేస్?

ఫాయకాపురం, జూలై 4: ఫోన్‌లో మెసేజ్ వచ్చిందీ...! ఇదేమైనా అసాధారణమైన విషయమని అనుకుంటున్నారా? ఔను..అసాధారణమైన సందేశమే! అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట వచ్చిన మెసేజ్! ఇదేంటి సామాన్యుల ఫోన్‌కు సిఎం మెసేజ్ పంపారా అంటే కచ్చితంగా పంపారనే చెప్పాలి. ఇంతకీ విషయమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండిక! కండ్రిక ప్రాంతానికి చెందిన పామర్తి ధనలక్ష్మీ అనే మహిళ ఇక్కడే ఫ్లాట్ నెంబరు 22లో నివాసముంటోంది. వితంతు పెన్షన్ కోసం జన్మభూమి గ్రామసభలో సంవత్సరం క్రితం ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే సంవత్సరమైనప్పటికీ తనకు పెన్షన్ అయితే రావడం లేదుగానీ, గత రెండు నెలలుగా నెలకోసారి ‘మీకు పెన్షన్ వచ్చింది.. తీసుకున్నారా? జాగ్రత్తగా వచ్చిన వెయ్యిని సద్వినియోగం చేసుకోండి.. ఇట్లు మీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు’ అని ఉంటోంది. ఈ సందేశాన్ని చదివిన ఆమె ఆశ్చర్యపోయింది. తనకు పెన్షన్ రావడం లేదంటూ సోమవారం ఉదయం విలేఖరుల ముందు వాపోయింది. సందేశాలు వస్తున్నాయి తప్ప పెన్షన్ రావడం లేదని, అధికారులు కూడా తమకు పెన్షన్ మంజూరు కాలేదని చెబుతున్నారని వాపోయింది. మరి టెక్నాలజీని అన్ని రకాలుగా వాడుకునే సిఎంగారూ, ఎమ్మెల్యే గారూ.. ఈ మహిళ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని సరిచేస్తే ఆమెకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.