S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిడ్డను చంపుకోవడానికి అనుమతించండి

మదనపల్లె, జూలై 4: ‘మా బిడ్డను బతికించుకోలేం.. కనీసం చంపుకోవడానికైనా అనుమతివ్వండి’ అంటూ ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం విజయనగర్‌కాలనీలో నివాసముంటున్న రాయపేట నారాయణ, శ్యామలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరు దినసరి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత ఏడాది నవంబర్‌లో విపరీతమైన జ్వరం వస్తోందని కళాశాల నుంచి సమాచారం అందుకున్న తండ్రి నారాయణ కుమార్తెను ఇంటికి తీసుకువచ్చి స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి రక్తపరీక్షలు చేయించగా బ్లడ్‌క్యాన్సర్‌గా నిర్ధారించారు.
ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆశపడిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సంప్రదించగా ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పడంతో, బెంగళూరు సెయింట్‌జాన్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. సుమారు రెండు నెలలపాటు రూ.8 లక్షలు ఖర్చుపెట్టి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేక యథాస్థితికి చేరుకోవడంతో సెయింట్‌జాన్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆపరేషన్, చికిత్సల ఖర్చు రూ.6 లక్షలు అవుతుందని, అదనంగా మందులు కొనుగోలు చేసుకునే స్థోమత ఉంటే చికిత్స చేస్తామని, అయినప్పటికీ గ్యారంటీ ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో తల్లిదండ్రులు బెంగళూరులోనే కిడ్‌వాయి క్యాన్సర్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. అక్కడా అదే విషయం చెప్పడంతో చేసేది లేక ఇంటిముఖం పట్టారు. ‘కూలి పనులు చేసుకుని జీవనం సాగించే తమకు వైద్యం చేయించే స్థోమత లేదు. కుమార్తె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. కళ్ల ముందు బాధ పడుతుండగా చూడలేము. అలాగని మా బిడ్డను బతికించుకోలేం. కనీసం చంపుకోవడానికైనా అనుమతివ్వండి’ అంటూ మదనపల్లె కోర్టును ఆమె తల్లిదండ్రులు ఆశ్రయించారు. మదనపల్లె కోర్టు జిల్లా రెండవ అదనపు జడ్జి జయరాజ్ సోమవారం ఉదయం పిటిషన్ స్వీకరించి, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తల్లి, తండ్రి, బాధితురాలు రెడ్డి మాధవిలను విచారించారు. తరువాత ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదని, హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించారు.

మదనపల్లెలోని కోర్టు వద్ద విలేఖరులతో మాట్లాడుతున్న బాధితురాలి తల్లిదండ్రులు, విద్యార్థిని రెడ్డి మాధవి