S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణకు విత్తన ఖ్యాతి

హైదరాబాద్, జూలై 4 : విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ‘విత్తన భాండాగారంగా’ మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఓఇసిడి (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) విత్తన సర్ట్ఫికేషన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ వర్క్‌షాప్‌ను సోమవారం ఇక్కడి పార్క్ హోటల్‌లో ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ సీడ్ సర్ట్ఫికేషన్ ఏజెన్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం దేశంలో వారణాసిలోనే ఈ తరహా సంస్థ ఉందని, దక్షిణ భారత్‌లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
దక్షిణ భారత్‌లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకు సంబంధించి విత్తనాన్ని ధృవీకరించే అధికారం తెలంగాణ స్టేట్ సీడ్ సర్ట్ఫికేషన్ ఏజన్సీకి కేంద్రప్రభుత్వం కట్టబెట్టిందన్నారు.విత్తనోత్పత్తికి తెలంగాణ రాష్ట్రం అన్ని కోణాల్లో అనువైందని, మంచి వాతావరణం, సారవంతమైన భూములు, నీటి వసతి తదితర వౌలిక వసతులు ఉన్నాయని వివరించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తనాల్లో 60 శాతం ఉత్పత్తి తెలంగాణలోనే జరుగుతోందన్నారు. రెండు లక్షల మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని, 400 విత్తనోత్పత్తి సంస్థలు పనిచేస్తున్నాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందన్నారు.
నాణ్యత లేని విత్తనాలను ఎట్టి పరిస్థితిలోనూ రైతులకు అందచేయవద్దని, ఏవరైనా అలా చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. సీడ్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా 2016-17 లో రెండువేల గ్రామాల్లో 60 వేల మంది రైతులను భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం 50 లక్షల టన్నుల కాయగూరలు అవసరం అవుతున్నాయని, అయితే ఇందులో 15 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోందని పోచారం గుర్తు చేశారు. ఈ కారణంగానే కాయగూరల విత్తనాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాలకు అవసరమైన విత్తనాల్లో ప్రస్తుతం మన దేశం నుండి కేవలం ఒక శాతం మాత్రమే ఎగుమతి అవుతున్నాయని, 2025 వరకు దీన్ని 20 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ విత్తనశాఖ జాయింట్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

విత్తన సర్ట్ఫికేషన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభించి ప్రసంగిస్తున్న తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం