S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖైదీల విడుదల కేసు 4వారాలకు వాయిదా

న్యూఢీల్లీ, జూలై 4: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఖైదీల విడుదల కేసు విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2007లో ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2007 సంవత్సరానికి సిపాయిల తిరుగుబాటు జరిగి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భాంగా అప్పటి సిఎం వైఎస్ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసేందుకు రెండు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలో గౌరు వెంకటరెడ్డి, మద్దెల చెర్వు సూర్యనారాయణ రెడ్డి, చార్మినార్ వద్ద పేలుళ్ల కుట్ర పన్నిన నరుూమ్ తదితరులున్నారు. ఖైదీల విడుదలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఖరారు చేసిన విధివిధానాలు లోపాభూయిష్టంగా ఉన్నాయని పిటిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.