S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరుగుదొడ్ల కంటే.. సిసి కెమెరాలే ముఖ్యమా?

హైదరాబాద్, జూలై 4: పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకున్నా సిసి కెమెరాలు, బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు చేయడం ఏమిటంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తెలంగాణ విద్యాసంస్థల్లో సిసి కెమరాల ఏర్పాటును దశల వారీ చేపట్టారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం, బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయడం మున్ముందు తప్పనిసరే అయినా అంతకంటే ముందు వౌలిక అవసరాలైన తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం పాఠశాలల్లో కల్పించాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు సిసి కెమెరాల టెండర్లపై పెట్టిన దృష్టి ఇటు మంచి నీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలపై పెట్టి ఉంటే బావుండేదని వారు అభిప్రాయపడుతున్నారు.
రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల్లో కూడా సిసి కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి కాలేజీలో నాలుగు కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి కాలేజీలో నాలుగు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతదుకు దాదాపు లక్ష 14వేల రూపాయిలు ఖర్చు చేస్తున్నారు.
బయోమెట్రిక్ యంత్రాలు, సిసి కెమెరాలకు కలిపి కేవలం ప్రభుత్వ జూనియర్ కాలేజీలకే నాలుగు కోట్ల రూపాయిలను ప్రభుత్వం మంజూరు చేసింది. స్కూళ్లకు, కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, యూనివర్శిటీలకు కలిపి దాదాపు 30 కోట్ల రూపాయిల వరకూ తొలి దశలో ఖర్చు చేయనుంది. ఈ డబ్బుతో కనీసం ప్రాథమిక వసతులు, ఉపాధ్యాయులకు బోధనోపకరణాలు, మహిళా టీచర్లకు విశ్రాంతి గదులు, స్కూళ్లలో వంట గదులు, భోజన శాలలు నిర్మించినా సత్ఫలితాలు ఇచ్చేదని అంటున్నారు.
కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి నిర్వహణను ప్రైవేటు ఏజన్సీలకు ప్రభుత్వం అప్పగించటంతో ఆ పేరుతో మరికొంత డబ్బు వృథా కాబోతోందని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి చిన్న చిన్న సమస్యలు వస్తే కెమెరాలను మరమ్మతు చేసేందుకు అవసరమైన కనీస శిక్షణ, నైపుణ్యం స్థానిక సిబ్బందికి లేదని, ఇదంతా కొత్త వ్యవహారం కావడంతో రెండురోజుల ముచ్చటగానే కనిపిస్తోందని తెలంగాణ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘం నాయకుడు బోయపల్లి రామశెట్టి పేర్కొన్నారు. కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేయటంతో ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో ఎన్‌రోల్‌మెంట్ తగ్గిందని, రానున్న రోజుల్లో మరింతగా ఎన్‌రోల్‌మెంట్ తగ్గే ముప్పు ఏర్పడిందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కాలేజీలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలకు మాత్రం మినహాయింపు ఇవ్వడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.