S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దివ్యాంగులకు 3శాతం రిజర్వేషన్లు తప్పనిసరి

న్యూఢిల్లీ, జూలై 4: భర్తీ ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ అన్ని ఉద్యోగాల్లోనూ దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దివ్యాంగుల (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తి ప్రమేయం) చట్టం 1995లోనే అమలులోకి వచ్చినప్పటికీ ఇంత వరకూ ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి నియామకాలు మూడు శాతం కంటే తక్కువే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని జస్టీస్ చలమేశ్వర్, అభే మనోహర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గ్రూప్-ఎ, గ్రూప్-బి సర్వీసుల్లో మూడు శాతం ఉద్యోగాలను ఇంకెంత మాత్రం తాత్సారం లేకుండా దివ్యాంగులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి సిబ్బంది, శిక్షణ విభాగం జారీ చేసిన రెండు ఉత్తర్వులను చట్ట విరుద్ధమైనవిగా కొట్టివేసింది. వీటిని సవాలు చేస్తూ ప్రసార భారతిలోని దివ్యాంగ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌లు విచారించిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. గ్రూప్-ఎ, గ్రూప్-బిలో కాకుండా గ్రూప్=సి, గ్రూప్-డిలోనే దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లను వర్తింపజేసే విధంగా సిబ్బంది, శిక్షణ విభాగం ఆ ఉత్తర్వులను జారీ చేయడాన్ని పిటిషనర్లు సవాలు చేశారు.