S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

కాళిదాసు, కావలి
నారదుడే విశ్వంలో మొట్టమొదటి ‘రిపోర్టర్/ జర్నలిస్ట్’ అని ఆరెస్సెస్ వాళ్లు ‘నారద జయంతి’ జరుపుతుంటారు. నిజమేనా? మీ అభిప్రాయం?
నాకు తెలిసినంతలో భారత యుద్ధాన్ని లైవ్‌గా రిపోర్టు చేసిన సంజయుడే మొదటి జర్నలిస్టు.

అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్లని ‘బాబు’ తిరుపతిలో అన్నాడో, లేదో అర క్షణంలో బ్రాహ్మలొక్కరే బాగుపడిపోతారేమో అన్నట్లు సోషల్ మీడియాలో ‘విషం’ కక్కారందరూ మూకుమ్మడిగా. ఎంత దారుణం? వాళ్ళూ బతకక్కర్లేదా?
ఏమో!

సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదివి ఎంతోమంది సివిల్స్ వంటి పోటీ పరీక్షలో ప్రతిభను చాటారు. గొప్పగొప్ప మేధావులయ్యారు. మరి ఈ ఇంగ్లీష్ మీడియంపై నేటి తరానికి మోజేమిటి?
అది తెలుగు భాష బాగోగులు పట్టని మేధావులు, భాషా ఉద్యమం కాడి కింద పారేసిన వయోధికులు, ప్రజల మనసుల్లో విషం నూరిపోసే కుహనా విద్యావేత్తలు, బాధ్యత మరిచిన సర్కార్లు కలిసి కట్టుకున్న పుణ్యం.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
అధ్యక్ష ఎన్నికలలో గెలిస్తే ముస్లింలను దేశంలోకి అడుగుపెట్టనివ్వనన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, నేను గెలిస్తే ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి, ప్రవాసీయులకు ఇచ్చే ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లకే ఇస్తానని ప్రకటించిన డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్. ఇద్దరూ తమ స్థాయిని తగ్గించి మాట్లాడుతున్నారనిపిస్తోంది. వీరిలో ఎవరు గెలిస్తే భారతదేశానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని మీ అభిప్రాయం?
గెలిచేది ఎవరైనా గద్దె మీద కూచున్నాక చేసేది ఒకే తీరు. ఆ గద్దె మహిమ అలాంటిది.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
‘అడ్డగోలు విభజన. కట్టుబట్టలతో వదిలేశారు’ అంటున్నారు చంద్రబాబు. ఈ అడ్డగోలు విభజనకు నాంది బాబుగారు కాదా? 2008లో లేఖ ఇవ్వడం, 2013లో మరో లేఖ ఇచ్చి సోనియాగార్ని కంగారు పెట్టడం మూలంగానే ప్రధాన ప్రతిపక్ష నేత సపోర్టు ఉందనే గదా సోనియాగాంధీగారు రాష్ట్రాన్ని విడదీసింది?
చరిత్ర అడక్కు. చెప్పేది విను.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
కొడుక్కి కట్నం తీసుకునేటప్పుడు ఆచారం. కూతురికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దురాచారం. తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారేదెప్పుడండీ?
మారదు.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
నేటి మన నాయకులు, రాజకీయ అవినీతి మలినాన్ని వదిలిపెట్టి ‘స్వచ్ఛ భారత్’తో పరిసరాల పరిశుభ్రతను పాటించటం ఎంతవరకు సమంజసం, చెప్పండి!
దానినైనా మలినం చేయకుండా విడిచిపెడితే మంచిదే.

దానం చేద్దామంటే కనీసం 5 రూ.కి తక్కువ అంగీకరించటం లేదు. కాఫీ, టీ ధర 8 రూ. సెల్‌ఫోన్‌లో 5 ని. మాట్లాడితే బిల్లు భారమవుతున్న రోజుల్లో అమూల్యమైన వార్తలు అందిస్తూ, పాఠకుల హృదయాలను దోచుకుంటున్న ‘ఆంధ్రభూమి’ ధరను పెంచటం సమంజసమని భావిస్తున్నాను.
సంతోషం.

తోట సదానందము, మంచిర్యాల
పరిమితముగ గాక పంచభక్ష్య పరమాన్న విందుల ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం పలు శీర్షికలతో పాఠక లోకాన్ని ఆరగింపజేస్తోంది. ఆదివారం ఆంధ్రభూమి దినపత్రిక ధరను అయిదు రూపాయలకు పెంచినా సంతోషంగ కొనేట్లున్నారు పాఠకులు. పెంచుకోకూడదా?
ఎప్పుడో మీ ముచ్చటా తీరుస్తాం.

డి.వెంకట్రావు, ఉయ్యూరు
తెలంగాణలో కెసిఆర్ టిడిపి, కాంగీ, వామపక్ష నావలకు కన్నం పెట్టి ముంచుతుంటే ఏ.పిలో బాబు వైకాపా నావను ఖాళీ చేస్తూ, టిడిపి నావను ఓవర్‌లోడ్ చేస్తూ ఓ పక్కకు ఒరిగిపోతున్నా తెడ్డు వేసి ఎదురన్నది లేదంటూ ముందుకు పోతున్నారు? ఇదేమి రాజకీయం?
టైటానిక్ రాజకీయం.

అయినం రఘురామారావు, ఖమ్మం
తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన మేధావుల, ఉద్యమకారులు వివిధ పార్టీల సలహా సహకారాలను తీసుకోకుండా ఒంటెద్దు పోకడలతో నియంతగా వ్యవహరించే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నిరోధించాలి.
అధికారమిచ్చిన ప్రజలు.

కె.వి.రమణమూర్తి, కాకినాడ
గోమూత్రంపై పన్నన్నారు. పన్నుకు పనికిరాని వస్తువు లేదన్నట్లుగా ఉంది. గోమూత్రంపై పన్ను వేసినట్లుగా గోమయానె్నందుకు వదిలేసినట్లు? గోమూత్రాన్ని కౌన్ని ఔషధాలలో కలుపుతున్నట్లుగా గోమయంతో మాత్రమే మనము నుదుట ధరించే విబూదిని తయారుచేస్తారు. ఏ కొద్దిమందో తప్పించి తక్కిన వారంతా విబూది ధరిస్తారు. అంటే గోమూత్రానికెంత విలువుందో గోమయానికి అంతే విలువుంది. మరి సర్కారు దృష్టికిదెందుకు రాలేదో?
త్వరలో రావచ్చు. ఏదో ఒక రోజు మన మూత్రం మీదా పన్ను వేయవచ్చు.

బావన సీతారాం, మందసా, కమలాపురం
ప్రభుత్వం విధివంచితులైన వికలాంగులకు కొన్నిచోట్ల వారి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొనకుండా జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుల సూచన మేరకు పింఛన్లు రద్దు చేయడం న్యాయసమ్మతమనవచ్చా?
అలాంటివి జరిగిన చోట్ల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. పౌర చైతన్యం ఉంటే చాలా సమస్యలు తీరుతాయి.

*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com