S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిరుగులేని తార!

ఆర్మీ కుటుంబంలో పుట్టిపెరిగిన అనుష్కాశర్మ మొదట మోడల్‌గా రాణించి అటుపై వెండితెర మీద అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో..మరెన్నో ఆలోచనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోవాలన్నదే ఈ అమ్మడి తపన. అదృష్టం తలుపుతడితే ఎవ్వరూ ఆపలేరు. తొలి చిత్రం ‘రబ్ నే బనాదీ జోడీ’లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత అగ్రహీరోలతో ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘లేడీస్ వర్సెస్ రికీ బాల్’, ‘జబ్ తక్ హై జాన్’, ‘పీకే’ ఇలా వరుస విజయాలు ఆమె ఖాతాలోకి వెళ్లడంతో బాలీవుడ్‌లో తిరుగులేని తార అయిపోయింది. ఆమె నటిస్తున్న చిత్రాలు.. చేస్తున్న పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటుండడంతో కెరీర్ పరంగా ఎదురేలేకుండా పోయింది. ‘‘స్వయం కృషితో పేరు తెచ్చుకోవడంలో వున్న తృప్తి మరొకటి లేదు. రికమెండేషన్‌లతో నాకు పనిలేదు. వాటివాళ్ల నేను ఇక్కడ నిలదొక్కుకోలేదు. వచ్చిన మంచి అవకాశాలను ఎంచుకోవడంలో నేను చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. అలాగని వచ్చినవన్నీ ఒప్పేసుకోవాలన్న రూలేమీలేదు’’ అంటూ చెప్పుకొచ్చింది ఒక సందర్భంలో. నిజమే..అందానికి అభినయం తోడవడంతో ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటోంది. వాహ్..అనుష్కా..మజాకా!!

-సమీర్